వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా డేంజర్ బెల్స్... భారత్‌లో ఎంతమంది వైద్యులు చనిపోయారో తెలుసా...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నుంచి ఎక్కువగా రిస్క్‌ను ఫేస్ చేస్తున్నది వైద్యులే. ప్రాణాలకు తెగించి మరీ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారియర్స్‌లా వాళ్లు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది వైద్యులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోన్న అంశం. భారత్‌లో ఇప్పటివరకూ 196 మంది వైద్యులు కరోనా కారణంగా మృతి చెందినట్లు తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) వెల్లడించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించాలని కోరింది.

జనరల్ ప్రాక్టీషనర్స్‌పై ఎఫెక్ట్...

జనరల్ ప్రాక్టీషనర్స్‌పై ఎఫెక్ట్...

ఎక్కువ మంది జ్వరం,దగ్గు,తలనొప్పి వంటి లక్షణాలు కనిపించగానే జనరల్ ప్రాక్టీషనర్స్‌ని ఎక్కువగా సంప్రదిస్తున్నారని... అందువల్లే కరోనా బారినపడుతున్నవారిలో వాళ్లు ముందు వరుసలో ఉన్నారని ఐఎంఏ వెల్లడించింది. ఇప్పటివరకూ కరోనా కారణంగా చనిపోయిన 196 మంది వైద్యుల్లో 170 మంది 50 ఏళ్ల పైబడ్డవారేనని తెలిపింది. ఇందులో 40శాతం మంది జనరల్ ప్రాక్టీషనర్స్‌ అని పేర్కొంది.

అత్యధికంగా తమిళనాడులో...

అత్యధికంగా తమిళనాడులో...

దేశంలో అత్యధికంగా తమిళనాడులో ఎక్కువమంది వైద్యులు చనిపోయారని ఐఎంఏ వెల్లడించింది. అలాగే మహారాష్ట్ర,గుజరాత్ రాష్ట్రాల్లో 23 మంది వైద్యులు చనిపోయినట్లు తెలిపింది. అలాగే బీహార్‌లో 19 మంది పశ్చిమ బెంగాల్‌లో 16మంది చనిపోయినట్లు పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 12 మంది వైద్యులు చనిపోయినట్లు తెలిపింది.

ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని...

ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని...

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 3.5 లక్షల మంది వైద్యులకు ఐఎంఏ ప్రాతినిధ్యం వహిస్తోంది. కోవిడ్ 19 కేసుల్లో ప్రభుత్వ,ప్రైవేట్ వైద్యులపై సమాన ప్రభావం ఉందని తెలిపింది. చాలా చోట్ల పేషెంట్లకు బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొందని, మందుల కొరత కూడా వెంటాడుతోందని వెల్లడించింది. ఐఏంఎ జాతీయ అధ్యక్షుడు డా.రాజన్ శర్మ మాట్లాడుతూ... వైద్యుల సంక్షేమం,భద్రత పట్ల ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని,అందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

Recommended Video

Kozhikode : మరణించిన 18 మంది ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్! || Oneindia Telugu
ప్రతీ వైద్యుడిని కాపాడుకోవాలి...

ప్రతీ వైద్యుడిని కాపాడుకోవాలి...

ఐఎంఏ సెక్రటరీ జనరల్ డా.ఆర్.వీ.అశోకన్ మాట్లాడుతూ... కోవిడ్ 19 కారణంగా వైద్యుల్లో మరణాల రేటు పెరగడం ప్రమాదకర పరిస్థితులను తలపిస్తోందన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ వైద్యుడిని కాపాడుకోవాల్సిన అసవరం ఉంది. ఒక్క వైద్యుడిని బతికించుకోవడమంటే వేలాది మంది పేషెంట్లను కాపాడుకోవడమే. కరోనా కారణంగా మృతి చెందిన వైద్యుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం,చేయూత అందించాలి.

English summary
total of 196 doctors in India, majority of them being general practitioners, have succumbed to coronavirus so far, said the Indian Medical Association (IMA) on Saturday, requesting Prime Minister Narendra Modi's for his attention on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X