వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరద్ పవార్‌కు రివర్స్ పంచ్!: 1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనలోపాటు ఎన్సీపీ పార్టీ కూడా షాకిస్తూ శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడికి కుమారుడు అజిత్ పవార్ ముఖ్య కారణం కావడం గమనార్హం. బీజేపీకి మద్దతిస్తూ అజిత్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ను కలిశారు.

బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్! ఒక్క వారమే సీఎంగా ఫడ్నవీస్: శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే సంచలనంబీజేపీ సర్జికల్ స్ట్రైక్స్! ఒక్క వారమే సీఎంగా ఫడ్నవీస్: శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే సంచలనం

మహా సంచలనమే..

మహా సంచలనమే..

దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనను గవర్నర్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

గతంలో శరద్ పవార్..

గతంలో శరద్ పవార్..

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మరుసటి ఉదయమే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అంతా అనుకున్నట్లు జరిగిదే శనివారం ఉయం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవారు. అయితే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీని చీల్చడంతో అంతా తలకిందులైంది. అయితే, అజిత్ పవార్ చేసినట్లే గతంలో శరద్ పవార్ కూడా చేయడం గమనార్హం.

1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్

1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్

అజిత్ పవార్ పనితో శరద్ పవార్ 1978లో సీఎం పీఠం ఎక్కిన పరిణామాలు గుర్తుచేసుకోక తప్పడం లేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను చీల్చిన శరద్ పవార్.. జన్‌సంఘ్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు.

1978లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించడం గమనార్హం.

అప్పుడు సీఎంగా శరద్ పవార్ సంచలనం

అప్పుడు సీఎంగా శరద్ పవార్ సంచలనం

అప్పటి సీఎం వసంత్‌దాదా పాటిల్ వద్దనే మంత్రిగా ఉండి మర్నాడే పార్టీని చీల్చి ప్రొగ్రెసివ్ ఫ్రంట్ నెలకొల్పి సీఎంగా శరద్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. అత్యంత చిన్న వయస్సు(38)లోనే సీఎంగా ప్రమాణం చేశారు. సరిగ్గా ఇప్పుడు ఆయనకే ఆ పాఠం ఎదురవడం విశేషం. అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తలపండిన రాజకీయ వేత్తగా పేరున్న శరద్ పవార్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. అయితే, తమవెంటే ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా ఉన్నారంటూ చెప్పడం గమనార్హం.

English summary
Sharad Pawar, brought down the Vasantdada Patil-led Congress government overnight and in that process, became the youngest Chief Minister of Maharashtra at the age of 38 the next morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X