వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్టులకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ -పాక్‌లో ఉగ్రవాదుల రాజభోగాలు -భద్రతా మండలిలో కడిగేసిన భారత్

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాదుల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సహా ఇతర దాడుల సూత్రధారులకు ప్రభుత్వ పరమైన భద్రత కల్పిస్తూ.. వారికి ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అందిస్తోన్న తీరును భారత్ మరోసారి ఎడగట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో రెండేళ్ల కాలానికి భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా చేసిన ప్రసంగంలోనే మన విదేశాంగ మంత్రి జైశకర్.. పాక్, చైనాలపై మండిపడ్డారు.

హైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారుహైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారు

టెర్రరిజాన్ని సమిష్టిగా అంతం చేయాలనే ఉద్దేశంతో రూపొందిన 1373వ తీర్మానాన్ని భద్రతా మండలి స్వీకరించిన దరిమిలా.. 'రాబోయే 20 సంవత్సరాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం' అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సీ)లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మంగళవారం ప్రసంగించారు.

 1993 Mumbai blast culprits enjoying state protection in Pak, EAM Jaishankar tells UNSC

భారత్ అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదంతో పోరాడుతోందని, అంతర్జాతీయ సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన భద్రతా మండలి తీర్మానాలకు మద్దతు పలుకుతున్నదని, అదే సమయంలో టెర్రరిజాన్ని ఉపేక్షించరాదనే నిర్ణయానికి అన్ని దేశాలూ కట్టుబడాలని మంత్రి జైశకర్ చెప్పారు. ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లంటూ ఉండబోరని ఆయన అన్నారు.

నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన హైకోర్టు -'హౌజ్‌ మోషన్' అత్యవసరం కాదన్న బెంచ్ -సుప్రీంకోర్టుకు ఎస్ఈసీ?నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన హైకోర్టు -'హౌజ్‌ మోషన్' అత్యవసరం కాదన్న బెంచ్ -సుప్రీంకోర్టుకు ఎస్ఈసీ?

ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల మధ్య సంబంధాలను కచ్చితంగా గుర్తించి, వాటి నిరోధానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని జైశకర్ గుర్తుచేశారు. ఇండియాలో 1993 ముంబై పేలుళ్లకు కారకులైన నేరస్తులకు పొరుగు దేశంలో జాతీయ భద్రత కల్పిస్తూ, రాజభోగాలు కల్పించారని పాకిస్తాన్ పేరెత్తకుండా జైశంకర్ మండిపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరులో ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావుండదని ఆయన స్పష్టం చేశారు.

 1993 Mumbai blast culprits enjoying state protection in Pak, EAM Jaishankar tells UNSC

వర్చువల్ విధానంలో జరిగిన భద్రతా మండలి కాన్ఫరెన్స్ లో మంత్రి జైశంకర్.. భారత్-చైనా సంబంధాలపైనా మాట్లాడారు. గడిచిన ఏడాదిగా సరిహద్దు వెంబడి కొనసాగుతోన్న ప్రతిష్టంభన వల్ల ప్రజాభిప్రాయం మారిందని, చైనాపై భారత్ కు నమ్మకం దెబ్బతినిందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా క్షీణించాయని జైశంకర్ చెప్పారు. భారత్ లో అవసరాలు తీరిన తర్వాత కొవిడ్ వ్యాక్సిన్ ఎగుమతులపై రాబోయే కొద్ది వారాల్లో స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు.

English summary
Addressing the United Nations Security Council for the first time since India assumed temporary membership of the UNSC, EAM S Jaishankar proposed an eight-point Action Plan and urged member states to commit to 'ero tolerance' for terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X