వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1993 ముంబై పేలుళ్ల కీలకపాత్ర పోషించిన ముస్తఫా మృతి

1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న ముస్తఫా దోసా బుధవారం మధ్యాహ్నం గం.2.30 మృతి చెందాడు. అతను గుండెపోటు వల్ల చనిపోయాడు.

|
Google Oneindia TeluguNews

ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న ముస్తఫా దోసా బుధవారం మధ్యాహ్నం గం.2.30 మృతి చెందాడు. అతను గుండెపోటు వల్ల చనిపోయాడు.

ముంబై వరుస పేలుళ్ల కేసులో ముస్తఫా దోసా దోషిగా తేలాడు. ఆర్థర్ రోడ్‌ జైల్లో ఉన్న ముస్తఫాకు బుధవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది.

1993 Mumbai blasts convict Mustafa Dossa dead; he suffered a cardiac arrest

దీంతో జైలు అధికారులు జేజే ఆస్పత్రికి తరలించారు. ముస్తఫా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. ఇది వరకే ముస్తఫాకు అధిక రక్తపోటు, షుగర్‌ వ్యాధి ఉన్నాయని ఆసుపత్రి డీన్‌ టీపీ లహానే చెప్పారు.

1993 మార్చిలో జరిగిన ముంబై వరుస పేలుళ్లలో 257 మంది మృత్యువాత పడ్డారు. ఆ పేలుళ్లలో ముస్తఫా కీలకపాత్ర పోషించాడని, అతనికి మరణశిక్ష విధించాలని సిబిఐ మంగళవారం న్యాయస్థానాన్ని కోరింది.

English summary
1993 Mumbai blasts convict Mustafa Dossa has died after suffering a cardiac arrest, JJ Hospital Dean Dr TP Lahane has confirmed. Dossa passed away at 2.30 pm.
Read in English: Mustafa Dossa hospitalised
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X