వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను బాంబులు మాత్రమే సరఫరా చేశాను: మెమెన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: 1993 ముంబై పేలుళ్ల కుట్రదారు యాకుబ్ మెమెన్ ఉరి శిక్షపై పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్ తిరస్కరించిన నేపథ్యంలో అతని ఉరిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముంబై వరుస పేలుళ్లు జరిగిన తర్వాత యాకుబ్ మెమెన్‌ను నేపాల్ సరిహద్దులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం ఓ టీవీ ఛానెల్‌ యాకుబ్ మెమెన్‌ను ఇంటర్యూ చేసింది. టీవీ రిపోర్టర్, యాకుబ్ మెమెన్ మధ్య జరిగిన సంభాషణ వివరాలిలా ఉన్నాయి. 'మీరు బాంబు పేలుళ్లో పాల్గొన్నారా? లేదు నేను పాల్గొనలేదు. బాంబు పేలుళ్లకు అవసరమైన సామాగ్రి సరఫరా చేశాను. అలాగే బాంబు పేలుళ్లు జరిపిన ప్రదేశాలకు వెళ్లే సౌకర్యాలను మాత్రమే కల్పించాను.' అని పేర్కొన్నాడు.

అంతేకాదు ' పేలుళ్ల అనంతరం వారిని దేశం దాటేందుకు సహకరించాను. ఇదంతా టైగర్ మెమెన్ ఆదేశాలతోనే చేశాను. ఇందులో పాకిస్ధాన్ ప్రభుత్వం, పాక్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ హస్తముందని తెలుసు. గతంలో పాకిస్ధాన్‌క‌ు వెళ్లాను. అక్కడ బిజినెస్ చేశాను.' అని తెలిపాడు.

1993 Mumbai blasts convict Yakub Memon tv reporter interview

'నేను పాకిస్ధాన్‌లో ఉండగా, నా అవసరాలన్నీ టైగర్ మెమెన్ చూసుకున్నాడు. దుబాయ్‌లో ఉన్న ఇంటికి వచ్చేయమని టైగర్ చెప్పాడు' అని తెలిపిన ఆయన తన అన్న టైగర్ మెమెన్ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని తెలిస్తే ఆపేవాడినని చివరగా పేర్కొనడం కొసమెరుపు.

1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం యాకుబ్ మెమన్ నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. రేపు (జులై 30)న అక్కడే ఉరిశిక్షను అమలు చేసే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే, 257 మంది ప్రాణాలను బలిగొన్న ముంబై వరుస పేలుళ్ల కేసులో తొలి ఉరి యాకుబ్ మెమన్‌దే.

1993 ముంబై వరుస పేలుళ్ల సంఘటనకు సంబంధించిన టైమ్‌లైన్:

1993 మార్చి 12: నిమిషాల వ్యవధిలోనే ముంబైలో 13 వరుస పేలుళ్లు. 257 మంది మృతి.
2006 సెప్టెంబర్‌ 12: తీర్పును వెల్లడించిన ముంబైలోని టాడా కోర్టు. 12 మందికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ ఖైదు ఖరారు.
2013 మార్చి 21: యాకూబ్‌ మెమన్‌, టైగర్‌ మెమన్‌ల ఉరిశిక్షలను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు. పది మందికి శిక్షలను యావజ్జీవంగా మార్పు.
2014 మే: యాకుబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌.
2014 జూన్‌ 2: క్షమాభిక్ష పిటిషన్లను ఓపెన్‌ కోర్టులోనే విచారణ జరపాలన్న నిబంధన మేరకు, ఉరిశిక్షను నిలిపివేసిన అత్యున్నత న్యాయస్ధానం.
2015 ఏప్రిల్‌ 9: మరణశిక్షపై యాకూబ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.
2015 జూలై 21: క్యూరిటివ్‌ పిటిషన్‌ తొసిపుచ్చిన సుప్రీం కోర్టు. జులై 30న ఉరిశిక్ష.

English summary
Few of the 100 persons convicted in the 1993 serial blasts case reacted like Yakub Memon when he heard the verdict of the trial court. Often mildly contemptuous but always well mannered in court, the younger brother of the prime accused in the case Tiger Memon, exploded when he heard the death sentence shouting at the judge, “Oh Lord, forgive this man for he knows not what he does.”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X