వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్ళ దోషులకు శిక్ష ఖరారు: ఇద్దరికి ఉరిశిక్ష

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

1993 Mumbai Case : Abu Salem Sentenced To Life ముంబై పేలుళ్ళ దోషులకు శిక్ష ఖరారు

ముంబై: 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళకు సంబంధించిన నిందితులకు టాడా కోర్టు గురువారంనాడు శిక్షను ఖరారుచేసింది. అబూసలేంతో పాటు కరీముల్లాకు టాడా కోర్టు జీవిత ఖైదును విధించింది. తాహిర్ మర్చంట్, ఫిరోజ్‌లకు ఉరిశిక్ష విధించగా, రియాజ్ సిద్దిఖికీ పదేళ్ళ శిక్ష విధించింది టాడా కోర్టు. మరోవైపు ఎలాంటి ఆధారాల్లేవని అబ్దుల్ ఖయ్యూమ్‌ను నిర్ధోషిగా కోర్టు విడుదల చేసింది.

1993 Mumbai serial blasts case: Karimullah Khan sentenced to life imprisonment

ముంబైలో 1993లో మార్చి 12వ, తేదిన వరుస పేలుళ్ళు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనలో అబూసలేం సహ ఆరుగురిని నిందితులుగా టాడా కోర్టు తేల్చింది.

రెండు గంటల వ్యవధిలో 12 చోట్ల ముంబైలో వరుస పేలుళ్ళు చోటుచేసుకొన్నాయి.

ఈ పేలుళ్ళ ఘటనలో 257 మంది మృతి చెందారు. 712 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాహిర్ మర్చంట్, ఫిరోజ్‌లకు ఉరిశిక్ష విధించగా, రియాజ్ సిద్దిఖికీ పదేళ్ళ శిక్షను విధించింది కోర్టు.

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌, మహ్మద్‌ దోసా, ముస్తఫా దోసాలు కుట్ర పన్ని దాడికి పాల్పడినట్లు సీబీఐ తన విచారణలో తేల్చింది. ఈ కేసులో ముంబయిలోని ప్రత్యేక టాడా న్యాయస్థానం 2007లో విచారణ ముగించింది. అందులో 100 మందిని దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరైన యాకూబ్‌ మెమన్‌కు 2013లో సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 2015లో ఈ శిక్షను అమలు చేశారు.

అయితే కేసు విచారణ ముగిసే సమయంలో ముంబయి పేలుళ్లతో సంబంధం ఉందంటూ ముస్తఫా దోసా, అబుసలెం సహా మరో ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో వీరిని ప్రధాన విచారణ నుంచి వేరు చేసి రెండో విడత విచారణ చేపట్టింది టాడా కోర్టు. వీరిలో ఆరుగురిని దోషిగా తేలుస్తూ నేడు శిక్ష విధించింది.

English summary
mumbai court ordered to Karimullah Khan sentenced to life imprisonment in 1993 mumbai serial blasts case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X