వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2.6 లక్షల మందికి ఇంటర్నెట్ లేదు, ఆన్‌లైన్ తరగతులు ఎలా..? జూన్ 1 నుంచే అంటోన్న విజయన్..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో.. ఇంటి నుంచే క్లాసులు జరుగుతాయని పేర్కొన్నది. కానీ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేవని నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. దీంతో విద్యార్థుల ఆన్ లైన్ తరగతుల నిర్వహణ అంశం ప్రశ్నార్థకమైంది. రాష్ట్రంలో సరైన ఏర్పాట్లు చేయకుండానే... తరగతుల నిర్వహిస్తామని పినరయి విజయన్ ఎలా ప్రకటించారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

 ధూల్ పేటలో నిశ్చితార్ధం ధూమ్ ధామ్.. 15 మందికి కరోనా పాజిటివ్ ధూల్ పేటలో నిశ్చితార్ధం ధూమ్ ధామ్.. 15 మందికి కరోనా పాజిటివ్

43.76 లక్షల స్కూళ్లు

43.76 లక్షల స్కూళ్లు

ఆన్ లైన్ తరగతుల నేపథ్యంలో సమగ్ర శిక్ష కేరళ విభాగం 43.76 లక్షల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల నుంచి వివరాలు సేకరించింది. దీనిని ‘హిందూ' పత్రిక రిపోర్ట్ చేసింది. ఇందులో కనీసం 2.6 లక్షల మంది విద్యార్థులకు కనీసం కేబుల్ కనెక్షన్ కూడా లేదు. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉన్న మొబైల్ కూడా లేదనే కఠోర నిజం వెలుగుచూసింది. దీంతో పాఠ్యాంశాలు ఆన్‌లైన్‌లో ఎలా నిర్వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

వాయనాడులో నో..

వాయనాడులో నో..

రాష్ట్రవ్యాప్తంగా చూస్తే వాయనాడులో దుర్భరంగా ఉంది. ఇక్కడే 15 శాతం అంటే 21 వేల 653 మంది విద్యార్థులు కంప్యూటర్ లేదు. అలప్పుజ జిల్లాలో తక్కువ సంఖ్యలో అంటే 6,683 మంది విద్యార్థులకు మాత్రమే ఇంటర్నెట్ కలిగిన కంప్యూటర్లు లేవు అని తేలింది. ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల కోసం వసతులు లేని వారికి సమకూరుస్తామని సీఎం విజయన్ ప్రకటించారు. కానీ మరో 11 రోజుల్లో పాఠ్యంశాలు బోధించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎలా వసతి కల్పిస్తారని సామాన్యుడి మదిని తొలచివేస్తోంది.

 ఫిజికల్ డిస్టన్స్

ఫిజికల్ డిస్టన్స్

ఆయా చోట్ల భౌతిక దూరం పాటిస్తూ..లైబ్రరీ లేదంటే పాఠశాలల్లో వసతి కల్పిస్తామని కేరళ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 1వ తేదీ నుంచి తప్పకుండా ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తామని తేల్చిచెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల వాయిదాపడ్డ ఎస్ఎస్ఎల్సీ, వొకేషనల్ హైయ్యర్ సెకండరీ పరీక్షలను ఈ నెల 26వ తేదీ నుంచి 30వరకు నిర్వహిస్తామని తెలిపారు.

English summary
2.6 lakh students in Kerala do not have access to a television with cable connection, a computer or a mobile phone with an internet connection, according to a survey conduct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X