వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: జ‌వాన్ల‌ని కూడా చూడ‌కుండా ర‌క్తమోడేలా కొట్టారు!

|
Google Oneindia TeluguNews

ల‌క్నో: ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ హోట‌ల్ కార్మికులు కొంద‌రు ఇద్ద‌రు జ‌వాన్ల‌పై దాడికి దిగారు. న‌డి రోడ్డు మీద బాహాబాహికి దిగారు. స‌రిహ‌ద్దుల్లో కాప‌లా ఉండే జ‌వాన్లు అని కూడా చూడ‌కుండా క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ జ‌వాను తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌రొక‌రికి స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ను స్థానిక పోలీసు యంత్రాంగం తీవ్రంగా ప‌రిగ‌ణంచింది. దాడికి దిగిన వారిని అరెస్టు చేసింది.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని బాగ్‌ప‌ట్ జిల్లా బ‌డౌత్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

బ‌డౌత్ స‌మీపంలోని సూజ్తీ గ్రామానికి చెందిన ఆజాద్ అనే వ్యక్తి సైన్యంలో జ‌వానుగా ప‌నిచేస్తున్నారు. శ‌నివారం సాయంత్రం ఆయ‌న త‌న కుమారుడు, త‌న స్నేహితుడైన మ‌రో జ‌వాను అమిత్‌తో క‌లిసి రాఠీ ప్రాంతంలోని ఓ హోట‌ల్‌కు భోజ‌నానికి వెళ్లారు. భోజ‌నం చేస్తుండ‌గా.. నాణ్య‌త విష‌యంలో గొడ‌వ చోటు చేసుకుంది. మంచి నీళ్లు, భోజ‌నంలో నాణ్య‌త లేక‌పోవ‌డాన్ని ఆజాద్ ప్ర‌శ్నించారు. దీనిపై హోట‌ల్ కార్మికులు దురుసుగా స‌మాధానం ఇచ్చారు. వారిపై దౌర్జ‌న్యం చేశారు.

దీనితో ఆజాద్, అమిత్ వారితో గొడ‌వ ప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. హోట‌ల్ కార్మికులు మొత్తం ఏడుమంది ఆ ఇద్ద‌రు జ‌వాన్ల‌పై దౌర్జ‌న్యానికి దిగారు. దీనితో ఇద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. తాము జ‌వాన్ల‌మ‌ని చెప్పిన‌ప్ప‌టికీ వినిపించుకోలేదు హోట‌ల్ కార్మికులు. చేతికి అందిన రాళ్లు, క‌ర్ర‌లు తీసుకుని దాడికి దిగారు. హోట‌ల్‌లో నుంచి రోడ్డు మీదికి తీసుకెళ్లి, త‌రిమి కొట్టారు. స్థానికులు విడిపించ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. వినిపించుకోలేదు. ఈ ఘ‌ట‌న‌లో ఆజాద్ త‌ల‌, ముఖానికి తీవ్ర గాయాల‌య్యాయి. ఆయ‌న ముఖం ర‌క్త‌సిక్తమైంది. ఈ ఘ‌ట‌న‌ను స్థానికుడొక‌రు వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

2 Army jawans thrashed by restaurant employees after argument in Uttar Pradesh

ఈ వీడియో స్థానిక పోలీసుల దృష్టికి చేరింది. వెంట‌నే రంగంలోకి దిగారు పోలీసులు. దాడికి దిగిన ఏడెనిమిది మందిని అరెస్టు చేశామ‌ని బాగ్‌ప‌ట్ పోలీస్ క‌మిష‌న‌ర్ ర‌మానంద్ ఖుష్వాహా తెలిపారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని, వారికి అక్క‌డ చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. చిన్న కార‌ణానికే హోట‌ల్ సిబ్బంది ఈ దాడికి దిగార‌ని ఆయ‌న వివ‌రించారు.

English summary
Two Army jawans were thrashed by the employees of a restaurant in Uttar Pradesh's Baghpat. Sunday showed goons descending on the two Army jawans with sticks and hurling abuses at them. One of the jawan was seen fighting back. He later tried to escape but was mercilessly beaten by the mob and was seen bleeding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X