వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూరిన్ పోసి, మలం తినిపించే యత్నం : తమిళనాడులో దారుణం, ఇద్దరి అరెస్ట్, పరారీలో ఒకరు

|
Google Oneindia TeluguNews

తిరువూరు : ఉత్సవ నిర్వహణలో మొదలైన గొడవ మలం తినిపించేంత వరకు వెళ్లింది. ముగ్గురు కలిసి దళితుడిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతనిపై యురిన్ పోసి పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నారు. వారి పిచ్చి పీక్‌కి చేరి .. మైండ్ పనిచేయకుండా పోయి, మలం తినిపించేంత వరకు వెళ్లింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కారణమిదీ ..

కారణమిదీ ..

తిరువూరు జిల్లా తిరుమందైరైకి చెందిన కొల్లిమల్లై (43) దళితుడు. ఇక్కడే బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అయితే గ్రామంలో జరిగే ఉత్సవం సమయంలో ముగ్గురు యువకులతో కొల్లిమలైకి గొడవ జరిగింది. దీనిని మనసులో పెట్టుకున్న యువకులు .. కొన్నిరోజుల క్రితం ఇంటికొస్తున్న కొల్లిమలైను ఆటకాయించి దాడి చేశారు. అతనిపై మూత్రం పోసి .. మలం తినిపించేందుకు ప్రయత్నించారు. తనను జరిగిన అవమానం గురించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇద్దరి అరెస్ట్ .. పరారీలో ఒకరు

ఇద్దరి అరెస్ట్ .. పరారీలో ఒకరు

బాధితుని ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శక్తివేల్, రాజేశ్, రాజకుమార్ అనే కొల్లార్ కులానికి చెందిన ముగ్గురి కోసం విసృతంగా గాలించారు. అయితే సోమవారం శక్తివేల్, రాజేశ్‌ను అరెస్ట్ చేశారు. వీరిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. రాజకుమార్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు.

ఉపేక్షించొద్దు ..

ఉపేక్షించొద్దు ..

దళితునిపై దాడిచేసి, అసభ్యంగా ప్రవర్తించినందుకు 341, 294బీ, 352, 506 (2) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ముగ్గురు యువకులపై కఠినచర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Tamil Nadu Police on Monday arrested two men for allegedly forcing a Dalit man to eat human faeces and for urinating on him in Thirumandurai village of Thiruvarur district. Police are on the look out for the third accused. The victim, P Kollimalai had filed a complaint alleging that he was compelled to eat human faeces by three men named Shaktivel, Rajesh and Rajakumar belonging to the Kallar community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X