వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ యువతులు, ఇద్దరు బీహర్ యువకులు.. పెళ్లిచేసుకున్నారు.. కట్ చేస్తే పోలీసు స్టేషన్‌లో....

|
Google Oneindia TeluguNews

సుపౌల్ : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. అక్కడ మిగతా వారు కూడా వ్యాపారం చేయొచ్చుని .. ఎలాంటి నిబంధన లేకుండాపెళ్లిళ్లు కూడా చేసుకొవచ్చు. కానీ ఇద్దరు బీహర్ యువకులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. వారిద్దరూ ఇద్దరు కశ్మీర్ యువతులను ప్రేమించారు. వారు కూడా అంగీకరించడంతో ఇంటివారయ్యారు. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. సీన్‌లోకి యువతి తండ్రి ఎంటరయ్యాడు. తమ కూతుళ్లను యువకులు కిడ్నాప్ చేశారని కేసు పెట్టడంతో .. వారు ఆందోళన చెందుతున్నారు.

హవ్వ.. స్కూల్‌లో వర్ణ వివక్ష... దళిత విద్యార్థులపై చిన్నచూపు....హవ్వ.. స్కూల్‌లో వర్ణ వివక్ష... దళిత విద్యార్థులపై చిన్నచూపు....

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌లో బీహర్‌కు చెందిన పర్వేజ్, తావ్‌రేజ్ అలామ్ కార్పెంటర్లుగా పనిచేశారు. అయితే అక్కడ వారికి ఇద్దరు యువతులు పరిచయమయ్యారు. విశేషమేమిటంటే ఇద్దరు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మనస్సులు కలిశాయి. వారు పరస్పర అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత సొంతూరు బీహర్‌లోని సుపౌల్ వద్ద గల రామ్‌విష్ణుపూర్‌కు వచ్చారు. ఇంటికొచ్చి సజావుగా కాపురం చేసుకుంటుంటే వారి ఇంటి తలుపును పోలీసులు తట్టారు. ఏంటీ అని ఆరా తీస్తే వారికి అసలు విషయం అర్థమైంది.

2 Bihar Brothers Married To Kashmiri Sisters Arrested For Kidnapping

వీరి పెళ్లి అంటే యువతి తండ్రికి ఇష్టం లేదు. తనను కాదని పెళ్లి చేసుకున్నారని భావించాడు. వారికి ఎలాగైనా బుద్దిచెప్పాలని అనుకొన్నాడు. వెంటనే బీహర్ వచ్చి .. స్థానిక పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. వారు పెళ్లి చేసుకోలేదని .. తమ కూతుళ్లని కిడ్నాప్ చేశాడని కంప్లైట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు పర్వేజ్ ఇంటికొచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము వారిని అపహరించలేదని యువకులు వాపోతున్నారు. తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు. తమ పెళ్లి అంటే ఇష్టం లేని వారి తండ్రి తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు.

English summary
Two brothers found their wedding bliss cut short after they were arrested on charges of kidnapping two Kashmiri sisters, whom they claim to have married just days back. Police from Jammu and Kashmir with the aid of their Bihar counterparts arrested both men for kidnapping the women from Jammu and Kashmir's Ramban district, Bihar Police said. Parvez and Tavrej Alam, who hail from Ramvishnupur village of Supaul are also brothers. They were working as carpenters in Ramban when they fell in love with the sisters, the police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X