వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన బస్సు: కోల్‌కతాలో ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా మహానగరంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రాసింగ్‌ వద్ద బస్సు సిగ్నల్‌ జంప్‌ చేసిన ఇద్దరు విద్యార్థులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్తున్న మూడు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు.

హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్‌ చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులపై ఎదురుదాడికి దిగిన స్థానికులు రాళ్లదాడికి దిగారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

 2 college students run over in Kolkata, mob torches buses, pelt stones

మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు రాగా స్థానికులు వాటిపై కూడా రాళ్లు విసిరారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఆందోళనకారులపై టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు.

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Two college students mowed down by a bus reportedly jumped signal at Chingrighata crossing on the Eastern Metropolitan Bypass (EM Bypass), an arterial road of Kolkata on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X