వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ తీసుకొని ఇద్దరీ మృతి.. ఐదుగురి పరిస్థితి సీరియస్.. మొత్తం ఎంతమంది అంటే..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే టీకా తీసుకున్న వారు ఇబ్బంది కూడా పడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకొని ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకు దేశంలో 3.81 లక్షల మంది వైద్యారోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ అందజేశారు. వీరిలో 580 మంది మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు.

వీరిలో చాలా మంది జ్వరం, తలనొప్పితో బాధపడ్డారు. ఏడుగురిలో మాత్రం కాస్త ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీరిలో మూడు ఢిల్లీలో వెలుగుచూశాయి. ఇద్దరు ప్రతాప్ గంజ్ మ్యాక్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉత్తరాఖండ్‌లో ఒకరి ఆరోగ్యం స్టేబుల్‌గా ఉంది. రిషికేష్ ఎయిమ్స్‌లో ఒకరు పరిశీలనలో ఉన్నారు. రాజ్‌నంద్ గావ్‌లో ఒకరి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది.

2 dead after receiving jab, 5 others develop severe adverse symptoms

కర్ణాటక చిత్రదుర్గ ఆస్పత్రుల్లో ఇద్దరు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. మొరాదాబాద్‌కి చెందిన ఒకరికీ శనివారం వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతని మృతికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. సోమవారం కర్ణాటక బళ్లారిలో ఒకరు చనిపోయారు. అయితే మొరాదాబాద్‌కు చెందిన వ్యక్తి మృతిపై అనుమానాలు వస్తున్నాయి. ఆయన టీకా తీసుకోవడం వల్ల చనిపోలేదని.. గుండెపోటు రావడంతో మృతిచెందారని తెలిపారు. దీంతో టీకా వల్లే చనిపోయారని చెప్పడానికి ఆధారం లేకుండా పోయింది. ఇక రెండో వ్యక్తి బళ్లారికి చెందిన 43 ఏళ్ల వ్యక్తి.. శనివారం టీకా తీసుకోగా.. సోమవారం చనిపోయాడు. మృతికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది.

English summary
Two out of seven Covid-19 vaccine beneficiaries who had developed severe adverse symptoms after being immunized have died
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X