వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్

|
Google Oneindia TeluguNews

లక్నో : పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర వాద దాడుల తర్వాత దేశంలో కశ్మీరీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. జవాన్లను ముష్కరులు పొట్టనపెట్టుకోవడంతో ఆగ్రహా ఆవేశాలకు గురైన కొన్ని అతివాద హిందూ సంస్థలు .. అమాయక కశ్మీరీలపై దాడులు చేస్తున్నారు. నిన్న లక్నో నడిబొడ్డున ఇద్దరు కశ్మీర్ వ్యాపారులపై అతివాద హిందూ సంస్థ ప్రతినిధులు రెచ్చిపోయారు. కర్రతో బెదిరిస్తూ .. దాడికి తెగబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో స్పందించిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

 కర్రతో చితక్కొట్టారు ..

కర్రతో చితక్కొట్టారు ..

లక్నోలో రద్దీగా ఉండే దలిగంజ్ సెంట్రల్ వద్ద ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం కూడా వ్యాపారం సాగుతోంది. ఎక్కడినుంచి వచ్చారో కానీ ... విశ్వహిందూ దళ్ అధ్యక్షుడు, అతని సహచరుడు కశ్మీర్ వ్యాపారుల వద్దకొచ్చారు. కాషాయ రంగు షర్ట్ ధరించి, కర్రతో ఉన్న వీడియో సామాజిక మాధ్యమల్లో ట్రోల్ అవుతోంది. రోడ్డు పక్కన డ్రై ప్రూట్స్ విక్రయిస్తున్న కశ్మీరీలపై విరుచుకుపడ్డారు. కర్రతో కశ్మీరీ వ్యాపారులపై దాడి చేశారు. ఇంతలో మరో కశ్మీర్ కొట్టొద్దని ప్రాధేయపడినా .. వినలేదు. తమ చేతిలో ఉన్న కర్రకి పనిచెప్పి .. చితక్కొట్టారు. తమ తోటి వ్యాపారిని కొట్టొద్దని అర్థిస్తోన్న వ్యక్తిని .. నీవెవరు .. నీ ఐటెండి కార్డు చూపించు అని సాయుధ పోలీసులా ప్రశ్నించాడు మరో వ్యక్తి. ఇంతలో స్థానికులు కలుగజేసుకొని .. కొట్టొద్దు ఆపాలని కోరిన వినలేదు.

 కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు

ఏళ్లుగా వ్యాపారం .. నిన్న దాడి

ఏళ్లుగా వ్యాపారం .. నిన్న దాడి

గత కొన్నేళ్లుగా కశ్మీరీలు ఇక్కడే వ్యాపారం చేస్తున్నారని .. వారిపై విరుచుకుపడటం ఏంటని స్థానికులు అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో పోలీసులు స్పందించారు. హజరత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

పరారీలో ప్రధాన నిందితుడు

కశ్మీర్ వ్యాపారులపై దాడిచేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనితోపాటు ఉన్న వ్యక్తిని పట్టుకొని .. దాడి ఘటన నిందితులను అరెస్ట్ చేశామని కలరింగ్ ఇచ్చారు పోలీసులు. మరో విషయమేమిటంటే దాడికి సంబంధించిన వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది అతనేనని తెలుస్తోంది. ఎంతైనా దేశంలో వ్యాపారులపై దాడిచేసిన వ్యక్తిని వదిలి .. అతనితోపాటు ఉన్న వారిని అరెస్ట్ చేయడం ఏంటని విమర్శలు వినిపిస్తోన్నాయి.

English summary
Two dry fruit vendors from Kashmir who were sitting on a busy road in Uttar Pradesh's capital Lucknow were attacked by a group of men belonging to a fringe right-wing group yesterday. One of the men had shared a video of the assault. The incident took place at 5 pm yesterday in Daliganj in central Lucknow. The men who assaulted the traders can be heard in mobile videos saying that are doing it because they are from Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X