వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతకు షాక్...ఇద్దరు ఎమ్మెల్యేలు 50 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరిక

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆపార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. దేశంలో భారి అధిక్యం కనబరిచిన బీజేపీ పంచన తృణముల్ ఎమ్మెల్యేలు, పార్టీ కౌన్సిలర్‌లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, కమ్యునిస్టు పార్టీ ఎమ్మెల్యే తోపాటు 50 మంది కౌన్సిలర్లు బీజేపీ నాయకుడు విజయవర్గీయ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

కాగా ఎన్నికల నేపథ్యంలో సుమారు 40 మంది తృణముల్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య ఎన్నికల్లో తీవ్రపోరు జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్రమోడీ అడుగు పెట్టకుండా మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చెపట్టారు. చివరి దఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్ అమిత్ షా చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది.

 2 MLAS 50-60 TMC councillors joined the BJP

ఇక ఎన్నికల పోరులో పార్లమెంట్‌లో మొత్తం 42 స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది. గతంలో రెండు స్థానాలు ఉన్న బీజేపీ 18 స్థానాలకు ఎగబాకింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మమతా పెద్ద షాక్ తగిలింది..దీంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఒక్కోక్కరుగా పార్టీని వీడీ బీజేపీలో చేరుతున్నారు.కాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తమకు ఎలాంటీ విభేదాలు లేవని బీజేపీకి ప్రజల అధరణ చూసి పార్టీలో చేరుతున్నట్టు కౌన్సిలర్లు ప్రకటించారు.

English summary
The political tussle in West Bengal between the Trinamool Congress and the Bharatiya Janata Party,continues to create ripples after as many as 50-60 TMC councillors and 2 MLAs (and one CPM MLA) today resigned from the party and joined the BJP in the presence of senior BJP leader Kailash Vijayvargiya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X