వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహుమతుల ఆఫర్: జల్లికట్టుకు మరో ఇద్దరి ప్రాణాలు బలి

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని జల్లికట్టు మరో ఇద్దరిని బలి తీసుకుంది. తమిళనాడులో జల్లికట్టులో పాల్గొనడానికి, దాన్ని చూడడానికి వచ్చినవారు మృత్యువాత పడుతున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి, డిప్యూటీ సిఎం ఓ.పన్నీరు సెల్వం జల్లికట్టును ప్రారంభించారు. దీంతో ఆ వివాదాస్పదమైన ఎద్దుల క్రీడుకు ప్రాధాన్యం పెరిగింది.

విజేతలకు బంపర్ ఆఫర్లు

విజేతలకు బంపర్ ఆఫర్లు

జల్లికట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసినవారికి కొత్త కార్లను బహుమతిగా ప్రకటించారు. మదరైలో సోమవారంనాడు జల్లికట్టును చూడడానికి వచ్చిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శివనగ్నలో మంగళవారం మరో ఇద్దరు మరణించారు.

స్టిక్కర్లతో జిగేల్మంటున్న కార్లు

స్టిక్కర్లతో జిగేల్మంటున్న కార్లు

ఉత్తమ ప్రదర్శన చేసినవారికి బహుమతిగా ఇచ్చే కార్లను జల్లికట్టుకు సమీపంలోని వేదికపై ఉంచారు. ఆ కార్లపై అన్నాడియంకె, జయలలిత స్టిక్కర్లు ఉన్నాయి. ఆ రెండు కార్లలో ఒక్కటి ఉత్తమ ప్రదర్శనకు ఇస్తారు. మరో కారు ఉత్తమ ఎద్దు యజమానికి ఇస్తారు.

దినకరన్ బహుమతి ఇదీ...

దినకరన్ బహుమతి ఇదీ...


ఆర్కే నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దినకరన్ ఉత్తమ ప్రదర్శనకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మదురైలోని జల్లికట్టు విజేతలకు సింగపూర్ పర్యటనకు ఉచితంగా టికెట్లు ఇస్తానని ప్రకటించారు. డిఎంకె నేత స్టాలిన్ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు విజేతలకు బంగారు ఉంగరాలను ప్రకటించారు.

Recommended Video

టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయం.. శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ !
అనుమతి రాబట్టిందెవరో...

అనుమతి రాబట్టిందెవరో...

సుప్రీంకోర్టు నిషేధం విధించిన తర్వాత జల్లికట్టుకు తిరిగి అనుమతి రాబట్టడంలో కీలక పాత్ర పోషించినవారి గురించి అన్నాడియంకె నేతలు ప్రజలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఈపిఎస్ చేసిన కృషి ఫలితంగానే జల్లికట్టు నిర్వహించుకోగలుగుతున్నామని అన్నాడియంకె నేతలు అంటున్నారు.వారు జయలలితను గౌరవిస్తున్నారని చెబుతున్నారు.

బహుమతులే బహుమతులు..

బహుమతులే బహుమతులు..

దాదాపు వేయి ఎద్దులు, 1,200 వ్యక్తులు జల్లికట్టులో పాల్గొనడానికి మంగళవారంనాడు నమోదు అయినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, విజేతలకు టూ వీలర్లు, రెప్రిజిరేటర్లు, ఎల్ఈడి టెలివిజన్లు, బంగారు నాణేలు, తదితరులు కూడా బహుమతులుగా ప్రకటించారు.

English summary
Three people have been gored to death while watching and participating in Jallikattu or bull-taming in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X