వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సియాచిన్: ఓ మృత్యుక్షేత్రం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న సియాచిన్ ప్రాంతం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రమని తెలిసిందే. అయితే అది ఓ మృత్యుక్షేత్రమని మాత్రం అందరికీ తెలియదు. ఇప్పటికే వందలాది మంది సైనికులను పొట్టనపెట్టుకుంది ఈ సియాచిన్ యుద్ధ క్షేత్రం. తాజాగా లాన్స్ నాయక్ హనుమంతప్ప అతని తొమ్మిదిమంది అనుచరులను మింగేసిందీ మృత్యు శిఖరం.

ప్రతి నెలా మంచుకొండ చరియలు విరిగిపడటం ద్వారానో, లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు అక్కడ ఏర్పడటం మూలంగానో కనీసం ఒక్కరు లేదా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణమృదంగం ఇప్పటిదేం కాదు.. 1984 నుంచే ఇది ప్రారంభమైంది.

సియాచిన్

సియాచిన్

తొలిసారి పాకిస్థాన్ సైన్యాన్ని ఏ విధంగానైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో అత్యంత దుర్భేద్యమైన దాదాపు 22వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైనిక శిబిరాలను ఏర్పాటు చేశారు.

సియాచిన్

సియాచిన్

1984 నుంచి అక్కడ భారత సేనలను నిలపడం ప్రారంభించారు. అంటే దాదాపు ఎవరెస్టు శిఖరం ఎత్తులో భారత జవాన్లు దేశ రక్షణ కోసం గట్టగట్టి చనిపోయే చలిలో నిత్యం గస్తీ కాస్తున్నారన్నమాట. ప్రభుత్వం లోకసభలో ప్రకటించిన ప్రకారం 1984 నుంచి 2015 మధ్య మొత్తం 869 మంది భారత సైనికులు సియాచిన్ గ్లేసియర్ వద్ద మృత్యువాత పడ్డారు.

సియాచిన్

సియాచిన్

అనంతరం జరిగిన కొన్ని ఘటనలు మొన్న జరిగిన ప్రమాదంలో పదిమంది సైనికులను కలుపుకొని మొత్తం ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 883కు చేరుకుంది. వీరిలో 33 మంది అధికారులు, 54 మంది జూనియర్ ఆఫీసర్లు, 782 ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు.

సియాచిన్

సియాచిన్

అత్యధికంగా 2011లో 24 మంది సైనికులు ఈ గ్లేసియర్లో మృత్యువాత పడగా.. 2015 ఐదుగురు చనిపోయారు. ఏడాదికి భారత ప్రభుత్వం ఈ ప్రాంత గస్తీ కోసం దాదాపు వేల కోట్లు ఖర్చు చేస్తోంది.

సియాచిన్

సియాచిన్

ఒక్క 2012-13, 2014-15 మధ్యనే రూ.6,566 కోట్లు ఖర్చు చేసింది. వీటిని అక్కడ ఉండే సైనికులకు కావాల్సిన వస్త్రాలు, పర్వాతారోహణ సామాగ్రి ఇతర వస్తువులకు ఎక్కువగా ఖర్చయ్యేవి. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలు ఉండటం సర్వసాధారణం. ఈ చలిని తట్టుకోవడం సాధారణ పౌరులకు సాధ్యం కానీ విషయమే.

సియాచిన్

సియాచిన్

ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి వెళ్లగలిగి ఆహార సామాగ్రిని చేరవేస్తాయి. ప్రతి సంవత్సరం మూడు బెటాలియన్ల నుంచి 3,000 మంది నుంచి 4 వేలమంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు ఇక్కడ గస్తీ కాస్తుంది.

సియాచిన్

సియాచిన్

అయితే, ఇలా ప్రతికూల పరిస్థితులున్నాయని, ప్రాణనష్టం ఎదురవుతుందని అక్కడ నుంచి సైనికులను విరమించుకుంటే దేశ రక్షణ గాలికొదిలేసినట్లవుతుందని, ఇది ఏమాత్రం సురక్షితం కాదని ఇటీవల రక్షణమంత్రి మనోహర్ పారికర్ చెప్పిన మాటలు సరైనవే అని ఆమోదించక తప్పదేమో.

సియాచిన్

సియాచిన్

ఎందుకంటే పక్కనే దయాది దేశం ఎప్పుడూ మనదేశంపై కుట్రలు పన్నుతూనే ఉంది. ఏ మాత్రం ఏమరపాటులో ఉన్న దాడులు చేసేందుకు పాక్ సైన్యం, ఉగ్రవాదులు సిద్ధంగానే ఉంటారు. అయితే, పాకిస్థాన్ సైనికులు కూడా ఆ దేశ సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతంలో పహారా కాస్తూనే ఉంటారు.

హనుమంతప్ప

హనుమంతప్ప

మన సైన్యం వారిపై పొరపాటున కూడా కాల్పులు జరపదని తెలిసినా ఆ దేశ సైన్యం పాక్ సరిహద్దు సియాచిన్ మంచు పర్వతాల్లో పహారా కాస్తూనే ఉంటుంది. పాక్ సైనికులు కూడా మంచు ప్రమాదాల బారిన పడి ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. అయినా దేశ రక్షణ కోసం సియాచిన్‌లో సైనికుల పహారా తప్పడం లేదు ఇరు దేశాలకు.

English summary
With the death of Lance Naik Hanumanthappa Koppad and nine of his comrades, India has lost nearly two soldiers every month due to avalanches or extreme climatic conditions in the Siachen Glacier, since first sending troops to the contested Himalayan area 32 years ago to counter the Pakistan army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X