వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో హైటెన్షన్ .. ఇద్దరు టీఎంసీ కార్యకర్తల హత్య, ఇద్దరి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

కోల్‌కత : పశ్చిమబెంగాల్‌ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. అధికార టీఎంసీ, బీజేపీ మధ్య గొడవలు మరింత ముదిరాయి. గత రెండురోజుల్లో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. రాష్ట్రంలో అశాంతికి కారణం బీజేపీయేనని టీఎంసీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ నేతల తీరు వల్లే ఘర్షణలు చెలరేగడానికి కారణమని ఆరోపిస్తోంది.

ఇద్దరు కార్యకర్తల హత్య ..
ఉత్తర్ బెంగాల్‌లోని కూచ్ బీహర్‌కు చెందిన టీఎంసీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. ఉత్తర 24 పరగణకు చెందిన మరో టీఎంసీ కార్యకర్త మంగళవారం చనిపోయిన సంగతి తెలిసిందే. టీఎంసీ కార్యకర్తల మృతికి బీజేపీ కారణమని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఉత్తర 24 పరగణలో టీఎంసీ కార్యకర్త బైక్ వెళ్తుండగా దాడిచేసి మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. తమ కార్యకర్త మృతికి బీజేపీ నేతల హస్తం ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. వీధిలో వెళ్తుండగా నిర్మల్ కుందును కొందరు కాల్చి చంపారని టీఎంసీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫుటేజీ సీసీటీవీలో రికార్డైందని పేర్కొన్నారు.

2 Trinamool workers killed in Bengal, party blames BJP as clashes trigger tension

కాల్పులు జరిపిన ఇద్దరినీ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. సుమన్ కుందు, సుజయ్ దాస్ అనే ఇద్దరు బీజేపీ యుత్ వింగ్‌కి చెందిన నేతలుగా గుర్తించామని పేర్కొన్నారు. మరోవైపు కూచ్ బీహర్‌లో జరిగిన ఘర్షణలో అజిజర్ అలీ అనే టీఎంసీ కార్యకర్త చనిపోయాడని ఆ పార్టీ నేతలు తెలిపారు. అతను ఇంటికి తిరిగి వెళ్తుండగా కాపుకాచి మట్టుబెట్టారని ఆరోపించారు. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు చనిపోయిన కార్యకర్తల మృతదేహాలను ఇవాళ సాయంత్రం బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ పరిశీలించనున్నారు.

బ్లాక్ డే ...
బెంగాల్‌లో తమ కార్యకర్తలపై దాడులను టీఎంసీ నేతలు నిరసిస్తున్నారు. ఇద్దరు కార్యకర్తలను బీజేపీ పొట్టనపెట్టుకోవడంతో .. ఇవాళ బ్లాక్ డేగా పాటిస్తున్నామని మీడియాకు విరించారు. మరోవైపు నైహతి మున్సిపాలిటీలో బీజేపీ సంబరాలు చేసుకోబోతుంది. ఇటీవలే టీఎంసీకి చెందిన కార్పొరేటర్లు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో చేరబోతోంది.

దీంతో ఇవాళ జరిగే సంబరాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ హజరవుతారని ఆ పార్టీ నేతలు తెలిపారు. తమ కార్యకర్తను హతమార్చడంపై టీఎంసీ నేతలు గుర్రు మీదున్నారు. తమ కార్యకర్తలపై చేయి వేస్తే తమ తడాఖా చూపిస్తామని బెంగాల్ మంత్రి జ్యోతిప్రియా మాలిక్ హెచ్చరించారు. నిర్మల్ కుందును బీజేపీ నేతలు సుపారీ ఇచ్చి హత్యచేయించారని ఆరోపించారు. హత్య కేసులో పట్టుబడిన వారు బీజేపీతో సంబంధం ఉందని తెలిపారు.

English summary
two Trinamool Congress workers have been killed in two days in West Bengal with the latest death being reported from North Bengal's Cooch Behar. Another party worker was killed in North 24 Parganas on Tuesday. Trinamool supporters have put the blame for both killings on BJP. A Trinamool Congress worker was killed in public glare in West Bengal's North 24 Parganas by bike-borne assailants on Tuesday. Trinamool supporters have alleged BJP workers are behind the act. CM Mamata Banerjee will be visiting the deceased, Nirmal Kundu's house on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X