వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ అమ్మాయి కోసం స్కూల్ లో ఇద్దరు టీచర్ల గొడవ, కక్ష, పక్కాప్లాన్ తో హత్య, భయంతో ఆత్మహత్య!

|
Google Oneindia TeluguNews

లక్నో/ అహమ్మదాబాద్: విద్యార్థులకు బుద్దిమాటలు చెప్పాల్సిన టీచర్లు ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరు టీచర్లు ఒకే అమ్మాయిని ప్రేయించి ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకున్నారు. సాటి ఉపాధ్యాయులు ఇద్దరు టీచర్లకు నచ్చచెప్పి పంచాయితీసులు చేసి విసిగిపోయారు. అయితే ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకోవడంతో అది కాస్త ముదిరిపోయింది. ఫలితంగా ఒక విద్యార్థిని కోసం ఓ టీచర్ హత్యకు గురి కావడం, మరో టీచర్ భయంతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆ లవ్ స్టోరీకి శుభం కార్డు పడింది.

లవ్ మ్యారేజ్, టిక్ టాక్ మోజులో అక్రమ సంబంధం, భర్త నైట్ డ్యూటీలు,భార్యకు అదే పని,ఫోన్ ఎంగేజ్, క్లోజ్లవ్ మ్యారేజ్, టిక్ టాక్ మోజులో అక్రమ సంబంధం, భర్త నైట్ డ్యూటీలు,భార్యకు అదే పని,ఫోన్ ఎంగేజ్, క్లోజ్

ఫేమస్ స్కూల్

ఫేమస్ స్కూల్

ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలోని కురైథియాలో హెచ్.పి. తివారి పబ్లిక్ స్కూల్ ఉంది. హెచ్.పి. తివారి పబ్లిక్ స్కూల్ కు చాలా పేరు ఉంది. హెచ్.పి. తివారి పబ్లిక్ స్కూల్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తివారి పబ్లిక్ స్కూల్ కు మంచి పేరు ఉండటంతో అక్కడ తమ పిల్లలను చదివించాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు.

అమ్మాయి కోసం ఇద్దరు టీచర్లు పోటీ

అమ్మాయి కోసం ఇద్దరు టీచర్లు పోటీ

హెచ్.పి. తివారి పబ్లిక్ స్కూల్ లో సూరజ్, అనూజ్, రత్నేష్ అనే ముగ్గురు ఉపాద్యాయులుగా పని చేస్తున్నారు. తీవారి పబ్లిక్ స్కూల్ లో ఇంటర్ చదువుతున్న అందమైన అమ్మాయిని సూరజ్, అనూజ్ ప్రేమించారు. అయితే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు సూరజ్, అనూజ్ ఒకరికి ఒకరు చెప్పుకోలేదు.

నువ్వా నేనా అంటూ!

నువ్వా నేనా అంటూ!

గత మూడు సంవత్సరాల నుంచి సూరజ్ ఆ ఇంటర్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. గత నాలుగు నెలల నుంచి అనూజ్ కూడా అదే ఇంటర్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. గత రెండు నెలల నుంచి అనూజ్ ఇంటర్ అమ్మాయితో మొబైల్ లో పిచ్చపాటిగా మాట్లాడుతున్నాడు. ఇటీవల ఈ విషయం బయటపడటంతో అనూజ్ కు విషయం తెలిసింది.

నాకు వదిలేయ్ బ్రో ?

నాకు వదిలేయ్ బ్రో ?

గత మూడు సంవత్సరాల నుంచి నువ్వు ప్రేమిస్తున్నా ఆ అమ్మాయి నిన్ను పట్టించుకోవడం లేదని, అందుకని తనకు ప్రేమించే చాన్స్ ఇచ్చి నువ్వు అమ్మాయిని మరిచిపోవాలని అనూజ్ సాటి ఉపాధ్యాయుడు సూరజ్ కు చెప్పాడు. అయితే అమ్మాయిని మరిచిపోవడానికి సూరజ్ నిరాకరించాడు. కావేలంటే నువ్వే ఆ అమ్మాయిని నాకు వదిలేయ్ అని సూరజ్ గట్టిగా చెప్పాడు.

 చంపేస్తే ఓ పనైపోతుంది

చంపేస్తే ఓ పనైపోతుంది

అమ్మాయి విషయంలో సూరజ్, అనూజ్ ఒకరి మీద ఒకరు కక్షపెంచుకున్నారు. ఎలాగైనా సూరజ్ పీడవదిలించుకోవాలని, నువ్వు నాకు సహాయం చెయ్యాలని అనూజ్ సాటి ఉపాధ్యాయుడు రత్నేష్ కు చెప్పాడు. సూరజ్ ను చంపేస్తే అమ్మాయి నీకు దక్కుతుందని, కావాలంటే నేను నీకు సహాయం చేస్తానని రత్నేష్ అనూజ్ కు చెప్పాడు.

పిలిపించి చంపేశారు

పిలిపించి చంపేశారు

ఫిబ్రవరి 11వ తేదీన ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నీతో మాట్లాడాలని మనూజ్ సాటి ఉపాద్యాయుడు సూరజ్ కు చెప్పాడు. అమ్మాయి విషయంలో మాట్లాడాలని పిలిచి ఉంటాడని అనుకున్న సూరజ్ అనూజ్ దగ్గరకు వెళ్లాడు. అదే రోజు అనూజ్ సాటి ఉపాద్యాయుడు రత్నేష్ తో కలిసి మఫ్లర్ తీసుకుని సూరజ్ గొంతు బిగించి ఊపిరిరాకుండా చేసి హత్య చేశారు.

భయంతో ఆత్మహత్య

భయంతో ఆత్మహత్య

పోలీసులు సూరజ్ హత్య కేసు నమోదు చేసి వివిద కోణాల్లో విచారణ చేస్తున్నారని తెలుసుకున్న మనూజ్ ఎక్కడ తనను అరెస్టు చేస్తారో అనే భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరజ్ హత్యకు సహకరించిన మరో టీచర్ రత్నేష్ భయంతో పరారైనాడు. ఒక అమ్మాయి కోసం ఓ టీచర్ హత్యకు గురి కావడం, మరో టీచర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడింది.

English summary
2 Young Teachers Dead For One Girl near Mirzapur In Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X