వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల ప్రాబల్య ప్రాంతాల్లో బీహార్ పోలింగ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో బాగంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం అయ్యింది. పోలింగ్ జరుగుతున్న ఆరు జిల్లాలలో పోలీసులు గట్టి బందోబస్తు ఎర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాలలో సాయుధ బలగాలను రంగంలోకి దింపారు.

శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పోలింగ్ ప్రారంభం అయ్యే సమయానికి అర్వాల్, రోహ్ తాస్, కైమూర్, ఔరంగాబాద్, గయా, జహనాబాద్ జిల్లాలలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. మొత్తం 32 శాసన సభ నియోజక వర్గాలలో పోలింగ్ జరుగుతున్నది.

20.61 percent polling has been recorded till 10 am in the second phase of 2015 Bihar Assembly polls

456 మంది అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తీవ్రవాదులు, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 11 నియోజక వర్గాలలో మద్యాహ్నాం 3 గంటలకు, 12 నియోజక వర్గాలలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ నిలిపి వేస్తున్నామని అడిషనల్ చీఫ్ ఎన్నికల అధికారి ఆర్. లక్ష్మణణ్ తెలిపారు.

9 నియోజక వర్గాలలో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని వివరించారు. మొత్తం 86,13,870 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, అందు కోసం 9,119 పోలింగ్ కేంద్రాలు ఎర్పాటు చేశామని అన్నారు. ఉదయం 10 గంటల వరకు 20.61 శాతం పోలింగ్ జరిగిందని, ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు.

English summary
Around 8.58 million voters are eligible to decide the fate of 456 candidates in 32 constituencies in the districts of Gaya, Aurangabad, Jehanabad, Arwal, as well as Kaimur and Rohtas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X