వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు ప్రమాదంపై యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి, ఘటనాస్థలానికి యూపీ మంత్రి, మృతులకు పరిహారం

|
Google Oneindia TeluguNews

యూపీలోని కనౌజ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఎస్పీ, కలెక్టర్లను సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలానికి వెళ్లాలని క్యాబినెట్ మంత్రి రాం నరేశ్ అగ్నిహోత్రికి సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయన ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

20 charred to death as bus bursts into flames after accident..

ప్రమాదంలో చనిపోయిన మృతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్సలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఘటనపై నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు పేర్కొన్నారు. కనౌజ్ జిల్లా గుర్సాగంజ్ నుంచి జైపూర్ వెళ్తుండగా జీటీ రోడ్డు వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ప్రమాదానికి గురయ్యాక ప్రయాణికులు బయటకొచ్చే వీలులేకుండా పోయిందని తెలుస్తోంది. బస్సులో అప్పటికే ప్రయాణికులు నిద్రపోయారని.. తలుపు, కిటికీలు తెరుచుకోకపోవడంతో అందులోనే ఉండిపోయారని తెలుస్తోంది. డబుల్ డెక్కర్ బస్సు విమల్ బస్సు సర్వీసెస్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు.

ఘినోయ్ గ్రామం వద్ద శుక్రవారం రాత్రి 9.30 గంటలకు డబుల్ డెక్కర్ బస్సును-ట్రక్కు ఢీ కొనడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 43 నుచి 50 మంది వరకుప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. పైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాయి. ప్రమాదంలో 20 మంచి చనిపోయారని, 21 మంది గాయపడ్డారని కనౌజ్ ఎస్పీ తెలిపారు. బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారని జిల్లా కలెక్టర్ అంతకుముందు మీడియాకు తెలియజేశారు. అందులో 26 మంది గుర్సాగంజ్ వద్ద 17 మంది చిబ్రమౌ వద్ద ప్రవేశించారని తెలిపారు. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే ప్రయాణికులు తప్పించుకోవడానికి వీలులేకుండా పోయింది. అందుకే మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందనే వాదన కూడా వినిపిస్తోంది. బస్సు ట్రక్కును ఢీ కొనడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షి రామ్ సేన్ తెలిపారు. వెంటనే బస్సు అద్దం పగులగొట్టి బయటకొచ్చానని చెప్పారు.

English summary
At least 20 passengers were charred to death and 21 others injured after a bus burst into flames at the GT Road in Uttar Pradesh's Kannauj on Friday night. The double-decker bus caught fire after a head-on collision with a truck on the highway. The accident took place around 09:30 pm near Chiloi village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X