వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌లో పేలుడు: 82 మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి 82 మంది దుర్మరణం పాలు కాగా, 85 మంది దాకా గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రలోని జబువాలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు.

ఓ హోటల్లో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. భవనం కుప్పకూలింది. వంట చేసే సమయంలో ఈ ప్రమాదం సంభవించిందా, గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందా అనేది తెలియడం లేదు.

20 feared dead in blast at Madhya Pradesh

పేలుడు శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. జుబవాకు 60 కిలోమీటర్ల దూరంలో గల పెట్లవాడ్ పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న భవనాలు కూడా బీటలు వారాయి.

సహాయక చర్యల కోసం అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంతర్ సింగ్ ఆర్యా సంఘటనా స్థలానికి బయలుదేరారు.

English summary
The blast at Jhabua in Madhya Pradesh in which 20 persons have died and 80 others injured is said to have occurred due to a gas cylinder explosion. While the initial findings indicate a gas cylinder explosion, further investigations are on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X