వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం: మంటలార్పేందుకు 20 ఫైరింజన్లు, తీవ్రంగా శ్రమించి..

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా‌లోని భాగ్ బజార్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి 20 ఫైరింజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి.

అయితే, సుమారు 40 గుడిసెలు అప్పటికే కాలి బూడిదయ్యాయి. బాఘ్ బజార్ మహిళా కాలేజీకి సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మురికివాడలో జరిగి ఈ అగ్ని ప్రమాదానికి వంట గ్యాస్ సిలిండర్ పేలడమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. గాలి బాగా వీయడంతోనే మంటలు మరింత వ్యాపించాయని తెలిపారు.

ఈ ప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు అంటుకున్న వెంటనే ఆ ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేసే సురక్షిత ప్రాంతానికి తరలించారు. సుమారు రెండుగంటపాటు శ్రమించిన ఫైరింజిన్లు మంటలను ఆర్పివేశాయి.

 20 fire engines are at the spot trying to bring the fire under control

కాగా, అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి మంటలను ఆర్పివేసేందుకు ఫైరింజిన్లు వచ్చాయి. అయితే, గంట ఆలస్యంగా అగ్ని మాపక సిబ్బంది రావడం వల్లే నష్టం భారీగా పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత పలువురు పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు.

ఓ జర్నలిస్టును కూడా ఆగ్రహంతో స్థానికులు దాడి చేసి గాయపర్చారు. స్థానికులను శాంతి పర్చేందుకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కాగా, అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు మాత్రం తెలియరాలేదు. గ్యాస్ సిలిండర పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగలేదు.

English summary
20 fire engines are at the spot trying to bring the fire under control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X