వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : ఆ అంత్యక్రియలకు హాజరైన 20 మందికి కరోనా పాజిటివ్...

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల బీహార్‌లో ఓ వ్యాపారవేత్త అంత్యక్రియలకు హాజరైన 20 మందికి తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేసిన అధికారులు శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు.

స్థానిక అధికారుల కథనం ప్రకారం.. జూలై 10న బీహార్‌లోని బిహ్తాలో జరిగిన వ్యాపారవేత్త రాజ్‌కుమార్ గుప్తా అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు,బంధువులు,సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భౌతిక దూరాన్ని పాటించలేదన్న ఆరోపణలున్నాయి. అంత్యక్రియలకు హాజరైనవారిలో గుప్తా మేనల్లుడికి మొదట కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత మరో కుటుంబ సభ్యుడిగా కూడా పాజిటివ్‌గా తేలింది.

 20 people tested coronavirus coronavirus positive after attending funeral in Bihar

అప్రమత్తమైన అధికారులు అంత్యక్రియలకు హాజరైన 37 మంది శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించారు. ఇందులో 20 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో బిహ్తాను కంటైన్‌మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. అలాగే పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల ప్రైమరీ,సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో ఉన్నారు.

Recommended Video

Sushant Singh Rajput Statue సుశాంత్ విగ్రహం ఏర్పాటు చెయ్యమని అడుగుతున్న అభిమానులు...!! || Oneindia

ఇప్పటివరకూ బీహార్‌లో 16642 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇందులో 5001 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 143 మంది వైరస్‌ సోకి మృతి చెందారు.

English summary
Recording yet another rise in coronavirus cases in Bihar, 20 people tested positive in Bihta area on Sunday (July 13, 2020) after attending a funeral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X