వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 కీలక ప్రశ్నలు.. చెప్పలేను, స్పష్టంగా తెలియదు.. సీబీఐకి చిదంబరం సమాధానాలు..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం అరెస్ట్ కేసులో కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు. బుధవారం నాడు అనూహ్యంగా చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు దశలవారీగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో గురువారం నాడు చిదంబరంను విచారించిన సీబీఐ అధికారులు 20 కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగించిన సీబీఐ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేయడం చర్చానీయాంశమైంది. బుధవారం రాత్రి సమయంలోనే మొదటి దఫా విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాత్రి 9.30 - 10.00 గంటల సమయంలో హైడ్రామా నడుమ చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. ఆ క్రమంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో చిదంబరంను సీబీఐ వర్గాలు విచారించినట్లు సమాచారం. ఆ నేపథ్యంలో ఆయన రాత్రంతా నిద్ర పోకుండా గడిపినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. విచారణలో భాగంగా గురువారం నాడు కూడా మరోసారి ప్రశ్నించారు సీబీఐ అధికారులు.

20 questions to p chidambaram by CBI officials

కరీంనగర్ రాజకీయం.. గంగుల బీజేపీలోకి.. ఆ ప్రచారంపై గరం గరం..!

అరెస్ట్ చేసిన వెంటనే సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు చిదంబరంను తరలించిన తర్వాత భోజనం చేయాల్సిందిగా సీబీఐ అధికారులు ఆయన్ని కోరినట్లు తెలుస్తోంది. అందుకు ఆయన తిరస్కరించారనే టాక్ వినిపిస్తోంది. బుధవారం రాత్రి మొదటి దఫాలో భాగంగా సీబీఐ అధికారులు ఆయనకు 20 కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఇంద్రాణీ ముఖర్జియాతో భేటీ, తదితర అంశాలపై ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక గురువారం నాడు ఉదయం రెండో దఫా విచారణ ఉదయం 8గంటలకే ప్రారంభించారు. అయితే సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే.. చెప్పలేను, స్పష్టంగా తెలియదు అనే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Congress leaders have been fired in the arrest of former Union Finance Minister and senior Congress leader P. Chidambaram. Chidambaram's arrest on Wednesday was spectacularly investigated by CBI officials. CBI officials who probed Chidambaram on Thursday reported 20 key questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X