వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరవై వేల నగదే..15 కిలోల బరువును ఆయన మోయలేకపోయాడు

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. డిల్లీకి చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం బ్యాంకులో 20 వేల చెక్ ను ఇచ్చాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ : పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజలు పడుతున్న కష్టాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఇరవై వేల రూపాయాలను బ్యాంకు నుండి ఇంటికి తెచ్చుకోవాలంటే డిల్లీకి చెందిన ఓ వ్యక్తి అష్టకష్టాలుపడ్డాడు. ఇతరులకు తనలాంటి కష్టాలు రావద్దని ఆయన కోరుకొన్నాడు.తన కష్టాన్ని ఆయన సామాజికమాథ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరల్ మారింది.

పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. నగదు మార్పిడి కోసమో....తమ వద్ద ఉన్న పాత నగదును బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి బారులు తీరుతున్నారు.అయితే నగదు మార్పిడి కోసం వచ్చేవారికి కొన్ని బ్యాంకుల్లో చుక్కులు చూపిస్తున్నారు.

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళకు రెండు వేల రూపాయాలను చిల్లర నాణెలను ఇచ్చారు బ్యాంకు ఉద్యోగులు.ఇదే తరహాలో డిల్లీకి చెందిన ఓ వ్యక్తికి కూడ చిల్లర నాణెలను ఇవ్వడంతో వాటిని ఇంటికి చేర్చుకోవడానికి ఆయన తిప్పలు పడ్డారు.

20 thousand rupees... 15kgs : viral this post in social media

డిల్లీకి చెందిన ఇంతియాజ్ నగదు కోసం బ్యాంకుకు వెళ్ళాడు. గంటల తరబడి క్యాూలో నిలబడ్డాడు తన వెంట తెచ్చుకొన్న 20 వేల చెక్ ను నగదు మార్పిడి కోసం బ్యాంకు అధికారులకు ఇచ్చాడు.అయితే బ్యాంకు అధికారులు ఇచ్చిన నగదును చూసి ఆయన షాక్ అయ్యాడు.

ఓ బ్యాగు నిండా 10 రూపాయాల నాణెలను ఇంతియాజ్ కు ఇచ్చారు బ్యాంకు అధికారులు. వీటి బరువు 15 కిలోల 420 గ్రాముల బరువు ఉంది. ఈ చిల్లర నాణెలను ఇంటికి తీసుకెళ్ళేందుకు ఆయన రిక్షాను తీసుకొన్నాడు. మూడో అంతస్థులో ఉన్న తన ఇంటికి వెళ్ళేందుకు ఆయన తిప్పాలు పడ్డాడు.బ్యాంకు నుండి తాను ఏ రకంగా చిల్లర నాణెలు ఉన్న బ్యాగును ఇంటికి తీసుకు వచ్చానో ఆయన సామాజిక మాథ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు వైరల్ గా మారింది.

English summary
Imtiayaz living in delhi . two days back he went to bank for withdraw money. he give to bank officers 20 thousand rupees check.bank employees given to imtiyaz 10 rupee coins in a bag. this bag weight around 15 kgs420 grams.he rent for rickshaw bring this bag to house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X