వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 వేల మంది మ‌ృతి, 2 లక్షల మూగజీవాలు కూడా : 1999లో ఒడిశాపై ఫొణి ప్రభావం

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ : ఫొణి సూపర్ సైక్లోన్ తీరం దాటింది. ఆ సమయంలో 200 కిలోమీటర్ల వేగంలో ప్రచండ గాలులు వీశాయి. తుఫాన్ మిగిల్చిన నష్టంపై ఇటు ఏపీ, అటు ఒడిశా అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఫొణి ప్రచండ తుఫాన్ ఒడిశాపై పెను ప్రభావం చూపింది. ఈ రక్కసి తుఫానుతో దాదాపు 10 వేల మంది ప్రజలు మృతిచెందారు.

3.5 లక్షల ఇళ్లు ధ్వంసం

3.5 లక్షల ఇళ్లు ధ్వంసం

సాధారణంగా తుఫాన్ హెచ్చరికలతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంటారు. అప్పుడు కూడా సహాయక చర్యలు, శిబిరాల ఏర్పాటు చేశారు. కానీ ఫొణి రక్కసి మాత్రం పెను విషాదాన్ని మిగిల్చింది. సూపర్ సైక్లోన్‌తో తీరప్రాంత ప్రజలు మాత్రం బిక్కు బిక్కుమని ఊపిరిలొదారు. తుఫాన్ ప్రభావంతో 10 వేల మంది చనిపోయారు. 3.5 లక్షల ఇళ్లు ధ్వసం కాగా .. కొన్ని గ్రామాలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయాయి. అంతేకాదు 2 లక్షల పశువులు కూడా మృతిచెందాయి. తుఫాన్ ప్రభావం 25 లక్షల ప్రజలపై ఎఫెక్ట్ చూపింది. దీంతో ఒడిశాలో మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం చూపడంతో .. కోలుకునేందుకు చాలా సమయం పట్టింది.

21 షెల్టర్లు .. 2 వేల మంది చొప్పున ఆశ్రయం

21 షెల్టర్లు .. 2 వేల మంది చొప్పున ఆశ్రయం

20 ఏళ్ల క్రితం తుఫాన్ సమయంలో చేపట్టిన సహాయ చర్యల తక్కవై .. పునరావాస బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అక్కడ వారికి వసతి కల్పించడం ఇబ్బందిగా మారడంతో మృతుల సంఖ్య పెరిగేందుకు దోహదపడింది. రాష్ట్రంలో 21 షెల్టర్లలో 2 వేల మంది చొప్పున పునరావాసం కల్పించారు. అయితే ఇంకా ఎక్కువమందికి పునరావాసం కల్పించలేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది.

260 కి.మీ వేగంతో గాలులు

260 కి.మీ వేగంతో గాలులు

ఒడిశాతోపాటు పారదీప్‌పై కూడా తుఫాన్ ఎఫెక్ట్ చూపింది. తుఫాను తీరం దాటే సమయంలో 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో ప్రభుత్వం, అధికారులు కూడా నిరాశ్రయులకు సాయం అందించలేకపోయింది. ఆ సమయంలో సీఎంగా ఉన్న గిరిధర్ గోమాంగో సహాయక చర్యలను ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించారు. ఫొణి తుఫాన్ సృష్టించిన బీభత్సంతో రాత్రి 9 గంటలకు సీఎం రెండు ఫోన్లు పనిచేశాయని, 11 గంటలకు ఒక ఫోన్ పనిచేసిందని .. తర్వాత ఫోన్లు డెడ్ అయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అప్పుడు 21, ఇప్పుడు 900 కేంద్రాలు

అప్పుడు 21, ఇప్పుడు 900 కేంద్రాలు

20 ఏళ్ల క్రితం ఫొణి తుఫాన్ బీభత్సంతో .. యంత్రాంగం అచేతంగా ఉంది. అప్పుడు కేవలం 21 పునరావాస కేంద్రాలు ఉండగా .. ఇప్పుడు అది 900 సెంటర్లకు చేరింది. మారిన పరిస్థితులు, టెక్నాలజీ సాయంతో తుఫానుతో జరిగే బీభత్సాన్ని ఆపగలిగారు. లేదంటే మరో పెను విషాదం జరిగి ఉండేది.

English summary
It was a day of fatal miscalculations. A day when death and its nauseating stench was everywhere. A day when all hell broke loose and nobody knew what to do. All rested on hope. But that day, even hope died. On October 29, 1999, a 'super cyclone' slammed into Odisha, then known as Orissa. Everyone knew the cyclone was coming. But, nobody knew how bad it was going to be. State government officials had underestimated the super cyclone's intensity and had miscalculated its path. There were not enough cyclone shelters to protect Orissa's tens of thousands of people. And, the government machinery was mired in chaos and confusion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X