వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్: డేరా బాబా ఫస్ట్ కాదు, 20 క్రితం వీకే శశికళ గురువు స్వామి ప్రేమానందకు 28 ఏళ్ల జైలు !

రేప్ కేసులో 10 ఏళ్ల కఠిన కారాగార శశిక్షకు గురైన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) మొదటి వ్యక్తి కాదు. గతంలో రేప్ కేసులో రెండు సార్లు జీవిత ఖైదు శిక్షకు గురైన మరో స్వామిజీ (బాబా) ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: రేప్ కేసులో 10 ఏళ్ల కఠిన కారాగార శశిక్షకు గురైన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) మొదటి వ్యక్తి కాదు. గతంలో రేప్ కేసులో రెండు సార్లు జీవిత ఖైదు శిక్షకు గురైన మరో స్వామిజీ (బాబా) ఉన్నారు. పక్కదేశం నుంచి భారత్ చేరుకుని స్వామిజీ అవతారం ఎత్తి చివరికి స్వామి ప్రేమానంద రేప్ కేసులో 20 ఏళ్ల క్రితం జైలుకు వెళ్లాడు.

శ్రీలంక తమిళుడు అయిన స్వామి ప్రేమానంద 1984లో భారత్ చేరుకుని తమిళనాడులోని తిరుచ్చికి 20 కిలోమీటర్ల దూరంలో ఓ ఆశ్రమం ఏర్పాటు చేసి స్వామీజి అవతారంఎత్తారు. ఆశ్రమానికి వస్తున్న యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్థించేవాడు.

యువతులను రేప్ చేసి !

యువతులను రేప్ చేసి !

స్వామి ప్రేమానంద ఆశ్రమంలో ఉంటున్న భక్తులను లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకునేవాడు. ఇదే సమయంలో ఆశ్రమంలో ఉంటున్న సురేష కుమారి అలియాస్ బేబి (20), లతా కుమారి (28) అనే ఇద్దరు యువతుల మీద స్వామి ప్రేమానంద అత్యాచారం చేశాడు.

Recommended Video

Gurmeet Ram Rahim Singh Sentenced To 10 Year Jail Term, Somebody Seek Life Term
రైతు సహాయంతో పారిపోయారు

రైతు సహాయంతో పారిపోయారు

స్థానిక రైతు సహాయంతో ఇద్దరు యువతులు 1994 డిసెంబర్ లో ఆశ్రమం నుంచి తప్పించుకుని పారిపోయారు. తరువాత ఐద్వా సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. యువతుల మీద అత్యాచారంతో పాటు ఓ హత్య కేసులో స్వామి ప్రేమానంద మీద కేసు నమోదు చేశారు.

జయలలిత, శశికళకు గురువు

జయలలిత, శశికళకు గురువు

స్వామి ప్రేమానంద రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. శ్రీలంక రాజకీయ నాయకులతో పాటు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత పీకే. పొన్నుస్వామి తదితరులు స్వామి ప్రేమానంద మాటలను గౌరవిస్తూ ఆశ్రమానికి కొన్ని సార్లు వెళ్లి వచ్చారు.

 రెండు సార్లు జీవిత ఖైదీ శిక్షలు

రెండు సార్లు జీవిత ఖైదీ శిక్షలు

రెండు అత్యాచారాల కేసులు నమోదు కావడంతో స్వామి ప్రేమానంద మీద విచారణ మొదలైయ్యింది. ఇద్దరు యువతకుల మీద స్వామి ప్రేమానంద అత్యాచారం చేశారని పోలీసులు సాక్షాలు సేకరించి కోర్టులో సమర్పించారు. రెండు రేప్ కేసులో కోర్టు స్వామి ప్రేమానందకు జీవిత ఖైదు (ఒక్కోకేసులో, మొత్తం రెండు జీవిత ఖైదీ శిక్షలు) విధిస్తూ స్వామి ప్రేమానందను జైలుకు పంపించారు.

చరిత్రలో డేరా బాబా, ప్రేమానంద

చరిత్రలో డేరా బాబా, ప్రేమానంద

శ్రీలంక నుంచి నిత్యం ఎల్ టీటీఈ నాయకులు సైతం స్వామి ప్రేమానంద ఆశ్రమానికి వచ్చి వెళ్లేవారని ఆరోపణలు రావడంతో ఆ విషయంపైనా అప్పట్లో విచారణ జరిగింది. భారతదేశంలో రేప్ కేసులో కఠిన శిక్షలకు గురైన స్వామిజీగా స్వామి ప్రేమానంద, ఇప్పుడు గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ లు చరిత్రలో నిలిచిపోయారు.

English summary
Not only Gurmit Rahm Rahim, in Tamilnadu too Swami Premananda got two times life punishment for sexually abuse women and young girls who were at his Ashram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X