• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

200 కోట్ల మనీ లాండరింగ్ కేసు: బాలీవుడ్ తారలు జాక్వెలిన్, నోరా ఫతేహిలకు ఈడీ సమన్లు

|
Google Oneindia TeluguNews

200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటీమణులు నోరా ఫతేహికి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కన్మాన్ సుకేశ్ చంద్రశేఖర్‌పై దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు నోరా ఫతేహిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం విచారణకు పిలిచింది.

 ఈడీ విచారణకు హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహికి నోటీసులు

ఈడీ విచారణకు హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహికి నోటీసులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కార్యాలయం ముందు హాజరు కావాలని నోరా ఫతేహిని ఈడీ జారీ చేసిన నోటీసులలో కోరారు. ఇంతకుముందు, ఈ కేసుకు సంబంధించి ఆగస్టు మరియు సెప్టెంబర్‌లో పలు సందర్భాల్లో జాక్వెలిన్ స్టేట్‌మెంట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది. 2017 లో ఎలక్షన్ కమిషన్ కు లంచం ఇచ్చిన కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్ ని విచారించగా పలువురు పేర్లు బయటకు వచ్చాయి. చంద్రశేఖర్ తీహార్ జైలు నుంచి 200 కోట్ల విలువైన దోపిడి రాకెట్ నడిపినట్లు ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్ వెల్లడించిన పేర్లలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఈడీ వారికి సమన్లు జారీ చేసింది.

 సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన ఈడీ కేసులో నోరా, జాక్వెలిన్ పేర్లు

సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన ఈడీ కేసులో నోరా, జాక్వెలిన్ పేర్లు

సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన చీటింగ్ కేసులో నోరా ఫతేహి స్టేట్‌మెంట్‌ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఏజెన్సీ, మూలాల ప్రకారం, కాన్మాన్ సుకేశ్ చంద్రశేఖర్ మరియు జాక్వెలిన్ మరియు నోరా ఫతేహి మధ్య ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అని దర్యాప్తు చేస్తోంది. అండర్‌ ట్రయల్ ఖైదీగా ఢిల్లీలోని రోహిణి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఒక వ్యాపారవేత్త నుండి ఏడాదికి 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతనిపై 20కి పైగా ఇతర దోపిడీ కేసులు కూడా నమోదయ్యాయి. తీహార్ జైలు నుండి సుకేష్ ఒక రాకెట్‌ను కూడా నిర్వహించాడు.

200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ తో పాటు లీనా మరియా పాల్ అరెస్ట్

200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ తో పాటు లీనా మరియా పాల్ అరెస్ట్

ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న సుకేశ్ భార్య లీనా మరియా పాల్ నివాసంపై కూడా ఈడీ దాడి చేసింది. లీనా మరియా పాల్ , బాలీవుడ్ హీరోయిన్ గానే కాక అనేక మలయాళ సినిమాలలో మీద నటించారు. జాన్ అబ్రహం నటించిన 'మద్రాస్ కేఫ్'లో కూడా ఆమె పాత్ర ఉంది. రెండు వందల కోట్ల మేర మోసం కేసులో బాలీవుడ్ హీరోయిన్ లీనా మరియా పాల్ తో ఆమె భర్త సుకేష్ చంద్ర శేఖర్ లను ఈడీ ఇటీవల అరెస్టు చేసింది.

సురేష్ చంద్ర శేఖర్, లీనా మరియా పాల్ లకు సంబంధించిన కోట్ల రూపాయల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంది. ఈ రాకెట్ లో ప్రధాన నిందితుడు సురేష్ కు సహకరించిన దీపక్ రామ్ దాని, ప్రదీప్ రమణి లను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహిలను విచారించనుంది.

నలభై సార్లు మోసానికి పాల్పడిన సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య లీనా

నలభై సార్లు మోసానికి పాల్పడిన సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య లీనా

సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య లీనా, మరో నలుగురు సహచరులు, వీరికి సహకరించిన బ్యాంక్ అధికారులు, కొంతమంది జైలు అధికారులను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఈడికి కీలక ఆధారాలు లభించడంతో చంద్రశేఖర్ భార్య లీలను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుకేష్ అక్రమంగా సంపాదించిన డబ్బులతో లీనా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్టు ఈడీ విచారణలో తేల్చింది.

జూన్ 2020 నుండి మే 2021 మధ్య ఈ జంట దాదాపు నలభై సార్లు మోసానికి పాల్పడినట్లుగా ఈడీ గతంలో పేర్కొంది. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రేపు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. రేపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కానుంది.

English summary
The Enforcement Directorate has issued summons to Bollywood actresses Nora Fatehi and Jacqueline Fernandez in a Rs 200 crore money laundering case in connection with Sukesh Chandrasekhar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X