వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: 200 వస్తువులపై పన్ను భారం తగ్గించే చాన్స్

జిఎస్టీ కౌన్సిల్ శుక్రవారం నాడు మరో200 వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ఈ వస్తువుల కొనుగోలుపై ఇప్పటివరకు పడిన భారం తగ్గే అవకాశాలున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

GST Council Set To Announce Big Tax Cut, 200 Items Get Cheaper

న్యూఢిల్లీ: జిఎస్టీ కౌన్సిల్ శుక్రవారం నాడు మరో200 వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ఈ వస్తువుల కొనుగోలుపై ఇప్పటివరకు పడిన భారం తగ్గే అవకాశాలున్నాయి.

ఆయా రాష్ట్రాల నుండి వస్తున్న సూచనల మేరకు జిఎస్టీ కౌన్సిల్ పన్నులను తగ్గిస్తూ వస్తోంది. కొన్ని వస్తువులపై పన్నులను యధాతథంగా ఉంచుతోంది. అయితే జిఎస్టీ అమలు తర్వాత ఆయా రాష్ట్రాల్లో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు మార్పులు చేర్పులు చేస్తున్నారు.

మరోవైపు జిఎస్టీ అమల్లోకి వచ్చిన కొందరు వ్యాపారులు మాత్రం పాత పద్దతుల్లోనే సరుకులను విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై ఫిర్యాదు చేయాలని కూడ ప్రభుత్వం కోరుతోంది.

 200 రకాల వస్తువులు ఇక చౌకగా

200 రకాల వస్తువులు ఇక చౌకగా

చేతితో రూపొందించిన ఫర్నీచర్‌ నుంచి శాంపు, శానిటరీ వేర్‌, ప్లే వుడ్‌ వరకు మొత్తం 200 పైగా వస్తువులు ఇక నుండి చౌకగా లభ్యం కానున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో గౌహతిలో జరుగుతున్న భేటీలో నేడు జీఎస్టీ కౌన్సిల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఎక్కువగా వినియోగదారులు వాడే వస్తువులపై పన్ను రేట్లు కోత విధించనున్నట్టు సమాచారం.

28 శాతం శ్లాబులో ఉన్న సేవలను 18 శాతం పరిధిలోకి

28 శాతం శ్లాబులో ఉన్న సేవలను 18 శాతం పరిధిలోకి

ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఉన్న వస్తువులను 80 శాతం ఉన్నాయి. ఈ వస్తువులన్నీ కూడ ఇకపై 18 శాతం పన్ను పరిధిలోకి రాబోతున్నట్లు సమాచారం. రెస్టారెంట్లపై విధిస్తున్న పన్ను రేట్లను కూడా తగ్గించనున్నారని సమాచారం.. పన్ను రేట్లను తగ్గించాలని అభ్యర్థిస్తూ రెస్టారెంట్ల యజమానులు జీఎస్టీ కౌన్సిల్‌తో విన్నవించారు.దీంతో జిఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

227 వస్తువులను 18 శాతం పన్ను పరిధిలోకి

227 వస్తువులను 18 శాతం పన్ను పరిధిలోకి

జీఎస్‌టీ 28 శాతం శ్లాబు పరిధిలో ప్రస్తుతం 227 వస్తువులున్నాయి. అయితే ఇందులో సుమారు 80 శాతం వస్తువులను 18 శాతం శ్లాబులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం 18 శాతం జీఎస్‌టీ పరిధిలో ఉన్నవాటిలో చాలా ఐటమ్స్‌ను 12 శాతం జీఎస్‌టీకి తగ్గించాలని కూడా జీఎస్‌టీ ఫిట్‌మెంట్ కమిటీ సిఫారసు చేసిందని బీహర్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోడీ ప్రకటించారు.

 చేతితో రూపొందించే వస్తువుల రేట్ల తగ్గింపు

చేతితో రూపొందించే వస్తువుల రేట్ల తగ్గింపు

ఎక్కువ మొత్తంలో పన్ను రేట్లు భరిస్తున్న కొన్ని ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలే తయారీ చేస్తున్నాయి. వీరిపై ఒత్తిడి అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లను పునఃసమీక్షించాల్సి ఉందని సమాచారం. చేతితో రూపొందించిన ఫర్నీచర్‌, షాంపు, శానిటరీ వేర్‌, స్యూట్‌కేస్‌, వాల్‌ పేపర్‌, ప్లేవుడ్‌, స్టేషనరీ ఆర్టికల్స్‌, వాచ్‌, ప్లే ఇన్‌స్ట్రుమెంట్స్‌ రెస్టారెంట్లపై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు ప్యానెల్‌ నిర్ణయించినట్టు సమాచారం.కోటి వరకు వార్షిక టర్నోవర్‌ ఉన్న వ్యాపారస్తులు కాంపోజిషన్‌ స్కీమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ఇన్‌పుట్‌ క్రెడిట్లు లేకుండా ఫ్లాట్‌ రేటులో పన్ను చెల్లించుకోవచ్చు.

English summary
From handmade furniture to shampoo to sanitary ware to plywood, the prices of over 200 items may get cheaper. The all-powerful GST Council is meeting today in Guwahati and there are expectations the panel, headed by Finance Minister Arun Jaitley, could approve tax cuts on many common-use goods for the benefit of consumers and businesses. At today's meeting, a decision could also be taken on lowering of tax rates food served in restaurants. The GST Council is also expected to offer more relief to small and medium enterprises (SMEs) in terms of compliance burden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X