• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సరిహద్దు రేఖ వద్ద మాటు వేసిన 200 మంది ఉగ్రవాదులు..ఏ క్షణమైనా..!

|

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌పై ఎలాగైనా దాడి చేయాలన్న ఉద్దేశంతో శత్రుదేశం చేయని కుట్రంటూ లేదు. ఇప్పటికే సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని నిఘా వర్గాలు చెబుతుండగా తాజాగా సరిహద్దుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు తిష్ట వేసి ఉన్నారని సమాచారం.

సరిహద్దులో మాటేసి ఉన్న 200 మంది ఉగ్రవాదులు

సరిహద్దులో మాటేసి ఉన్న 200 మంది ఉగ్రవాదులు

సరిహద్దుల్లోని లాంచ్ ప్యాడ్‌ల వద్ద 200 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. ఈ ఉగ్రవాదులంతా ఒక్క ఉగ్రవాద సంస్థకు చెందిన వారు కాదని... లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌లాంటి అగ్ర ఉగ్రవాద సంస్థలతో పాటు చిన్న సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా మాటు వేసి ఉన్నారని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. వీరంతా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద తిష్ట వేసి ఉన్నారని నిఘావర్గాలు వెల్లడించాయి. జమ్ము కశ్మీర్‌లో హింసను ప్రోత్సహించేందుకు వీరంతా అక్కడ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కశ్మీరీ యువకులను రిక్రూట్ చేసుకున్న ఉగ్రసంస్థలు

ఇప్పటికే కశ్మీరీ యువకులను రిక్రూట్ చేసుకున్న ఉగ్రసంస్థలు

ఇదంతా ఇలా ఉంటే స్థానిక కశ్మీరీ యువకులను ఉగ్రవాదం వైపు నడిపిస్తూ ప్రేరేపిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అంతేకాదు చాలామంది కశ్మీరీ యువకులను ఇప్పటికే రిక్రూట్ చేసుకున్నాయని సమాచారం. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ హింసకు పాల్పడాలని ప్రోత్సహిస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. లాంచ్ ప్యాడ్‌ల వద్ద పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మోహరించి ఉండటంతో భారత్‌లోకి చొరబడేందుకు పెద్ద కుట్రే జరుగుతున్నట్లు సమాచారం. ఈ శీతాకాలం వచ్చేలోగా వీరంతా భారత్‌లోకి అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతా ఐదారు బృందాలుగా విడిపోయి భారత్‌లోకి చొరబడేందుకు పావులు కదుపుతున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఈ మార్గాల ద్వారా భారత్‌లోకి చొరబడే యత్నం

ఈ మార్గాల ద్వారా భారత్‌లోకి చొరబడే యత్నం

ఇక భారత్‌లోకి చొరబడేందుకు కొన్ని మార్గాలను ఉగ్రవాదులు ఎంచుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అవి ఇలా ఉన్నాయి.

*గుజ్జర్దార్ నుంచి రాజ్వార్ వయా కైంత్వాలీ, జుమాగుండ్, పుట్టకన్ గాలి, అవూరా , జుర్హామా

* ఖాషిం నుంచి లోలబ్ వయా ఆర్‌సీ ఢోలక్, ముథాల్ నాలా, లస్దత్, ఎఫ్‌డీఎల్ గులాబ్, రంగ్వార్. రత్తపాని నుంచి కలారోష్ వయా దోసత్, ముతల్ గాలీ, ముహ్రీ, సుందీమర్‌.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నివాసముంటున్న 200 మంది కశ్మీరీలు ముజఫరాబాద్‌లోని తల్లిమండీలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ కార్యాలయంకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మరో నివేదిక వెల్లడించింది. ఉగ్రవాదంలో శిక్షణ పొందేందుకు వీరంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే ఏడు మంది ఉగ్రవాదులు భారత్‌లోకి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
About 200 terrorists, not just of the Lashkar-e-Taiba (LeT) and the Jaish-e-Mohammed (JeM), but also, smaller organisations like Al Badr (AB) and the Harkat-ul Jihad (HUJ) have reached launch pads along the Line of Control, latest intelligence reports have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more