వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్‌కు ఊరట: 2002 కేసులో వారంట్ రద్దు చేసిన కోర్టు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో దాఖలు చేసిన వారెంట్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ముంబై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సల్మాన్ వ్యవహరించలేదని ఈ నెల 4వ తేదిన కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. అయితే శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్ ఆ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో వారెంట్‌ను కోర్టు కొట్టేసింది.

బాలీవుడ్‌ సల్మాన్‌ ఖాన్‌కు ఊరట లభించింది.షూరిటీ ప్రక్రియ.. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు షూరిటీని సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

 2002 hit-and-run case: Court cancels bailable warrant against Salman Khan

ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరో కొత్త షూరిటీ పేరుతో రెన్యువల్‌ చేయాల్సి ఉంది. దీంతో సల్మాన్‌ తన బాడీగార్డ్‌ గుర్మీత్‌సింగ్‌ జోలీ అలియాస్‌ షేరా పేరును కోర్టుకు సమర్పించాడు. అయితే అందుకు సంబంధించిన అధికార ప్రక్రియను మాత్రం సల్మాన్‌ పూర్తి చేయలేదు. దీంతో ఏప్రిల్‌ 4న సెషన్స్‌ కోర్టు సల్మాన్‌కు బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది.

ఈ విషయమై సల్మాన్‌ కోర్టును అభ్యర్థించటంతో ఏప్రిల్‌ 11న దానిపై స్టే విధిస్తూ.. షూరిటీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏప్రిల్‌ 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్‌.. షేరాతో ఆ ఫామ్‌లపై సంతకాలు చేయించాడు. దీంతో కోర్టు వారెంట్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

English summary
A MUMBAI sessions court on Saturday cancelled a bailable warrant it had issued against actor Salman Khan in the 2002 hit-and-run case for not completing the process to furnish a surety as asked by the Bombay High Court. One person was killed and four were injured after Khan’s SUV ran them over in Mumbai in the intervening night of September 27 and 28 in 2002. The actor was acquitted in the case by the Bombay High Court in December 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X