2008 జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగుర్ని దోషిగా తేల్చిన కోర్టు, నిర్దోషిగా ఒకరు

జైపూర్: 2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించింది.

2008 మేలో జైపూర్‌లో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ పేలుళ్లలో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు.

2008 Jaipur serial blasts case: 4 held guilty, 1 acquitted

మొదట హవామహల్ వద్ద పేలుడు సంభవించింది. ఐదు నిమిషాల తర్వాత మరో ప్రాంతంలో బాంబు పేలుడు జరిగింది. సుమారు ఏడు చోట్ల ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఎక్కువగా పేలుళ్లు హనుమాన్ ఆలయాల వద్దే జరగడం గమనార్హం.

ఈ కేసుకు సంబంధించి 2018 ఫిబ్రవరిలో ముజాహిదీన్ ఉగ్రవాది అరిజ్ ఖాన్ అలియాస్ జునైద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ బాంబు దాడికి పాల్పడిన మరో ఇద్దరిని 2008లోనే ఎన్‌కౌంటర్ చేశారు. 12ఏళ్లపాటు కొనసాగిన విచారణ అనంతరం జైపూర్ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+