వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ గ్యాంగ్‌రేప్ కేసు: ముగ్గుర్ని దోషులుగా తేల్చిన కోర్టు

|
Google Oneindia TeluguNews

2008 Kandhamal nun gang-rape case
న్యూఢిల్లీ/కటక్: ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్‌లో అల్లర్లు జరిగిన సమయంలో ఓ క్రిస్టియన్ సన్యాసినిపై 2008లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. శుక్రవారం కటక్ జిల్లా కోర్టు తన తీర్పులో మరో ఆరుగుర్ని నిర్ధోషులుగా ప్రకటించింది.

ఈ కేసు విషయంలో 2010 ఆగస్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వాదనలు విన్న కోర్టు, మార్చి 14 శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. కాగా కేసు సంబంధించిన విచారణలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

అత్యాచార ఘటన అనంతరం ఢిల్లీలో ఉన్న బాధితురాలి దగ్గర్నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు ఒరిస్సా రాష్ట్రం నుంచి క్రైం బ్రాంచి పోలీసులు ఇక్కడికి వచ్చారు. బాధితురాలు ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపింది. అల్లర్ల సమయంలోనే తనపై కొందరు అత్యాచారానికి పాల్పడి, అర్థనగ్నంగా వీధుల్లో తిప్పారని బాధితురాలు ఆరోపించింది.

ఆమె దగ్గర్నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు కేసు దర్యాప్తు జరిపారు. విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2008లో జరిగిన కాంధమాల్ అల్లర్లో 38 మంది ప్రజలు హత్యకు గురయ్యారు. ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు లక్ష్మానంద సరస్వతీ హత్యకు గురైన తర్వాత ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి.

English summary

 Three people were convicted and six acquitted on Friday in a case involving rape of a Christian nun allegedly by religious fanatics during 2008 Kandhamal riots in Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X