వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీపై అత్యాచారం, హత్య: ముగ్గురు దోషులే, రేపు శిక్ష ఖరారు

2009లో జరిగిన పుణే మహిళా టెక్కీ హత్య కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

|
Google Oneindia TeluguNews

పుణే: 2009లో జరిగిన పుణే మహిళా టెక్కీ హత్య కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

సుమారు ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన మహిళా టెక్కీ నయనా(28) పైన సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులు ముగ్గురిని దోషులుగా తేల్చుతూ స్పెషల్ జడ్జి ఎల్ఎల్ యెంకర్ తీర్పునిచ్చారు.

2009 Pune techie rape and murder: Sessions court holds all three accused guilty

ఈ ముగ్గురిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య, తదితర నేరాల కింద మోపిన కేసులు నిరూపితమయ్యాయి. అయితే, ఈ ముగ్గురు దోషులకు ఏ శిక్ష విధించాలన్నది కోర్టు బుధవారం నిర్ణయించనుంది.

కేసు విషయానికి వస్తే పూణె-అహ్మద్ నగర్ స్టేట్ హైవేపై ఉన్న ఖరాడి ప్రాంతంలోని ఓ ఐటీ సంస్థలో నయనా సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేసేది. 2009 అక్టోబర్ 7న ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న సమయంలో కిడ్నాప్‌కు గురైంది.

రెండు రోజుల తర్వాత పుణె జిల్లా ఖఏడ్ తహసీల్‌లోని జరేవాడీ అటవీ ప్రాంతంలో పూజూరి మృతదేహం బయపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు కోసి అడవిలో పడేసి పరారయ్యారు. ఆమె వద్ద ఉన్న ఏటీఎం కార్డు, డబ్బులు తీసుకుని పారిపోయారు.

English summary
A sessions court in Pune on Monday held three accused in the 2009 kidnapping, rape and murder of software engineer Nayana Pujari guilty. The fourth was released as he turned approver. The quantum of sentence will be pronounced on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X