వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై వరుస బాంబు పేలుళ్లకు నేటితో 7 ఏళ్లు: ఉగ్రవాదులకు జులై టార్గెట్, ప్రజలు!

|
Google Oneindia TeluguNews

ముంబై: వాణిజ్య నగరం ముంబైలో 2011 జులై 13వ తేదీ జరిగిన వరుస బాంబు పేలుళ్లకు దేశం మొత్తం హడలిపోయింది. ముంబైలో 7 ఏళ్ల కిత్రం సరిగ్గా ఇదే రోజు ( జులై 13) జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 26 మంది అమాయకులు బలి అయ్యారు.

ముంబైలోని దాదర్, జవేరి బజార్, ఒపేరా హౌస్ ప్రాంతాల్లో జరిగిన వరస బాంబు పేలుళ్లలో 26 మంది మరణించగా 130 మందికి తీవ్రగాయాలై నేటికి కోలుకోలేని దీనస్థితిలో ఉన్నారు. ముంబైలో 2011 జులై 13వ తేదీ సాయంత్రం 6.54 నుంచి 7.06 గంటల మద్యలో కేవలం 12 నిమిషాల వ్యవదిలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి.

 2011 July 13:Re: Today is the anniversary of Serial blasts in Mumbai

నిత్యం వ్యాపార లావాదేవీలతో, ప్రజల రద్దీతో కిటకిటలాడే ముంబై నగరం ఆరోజు హడలిపోయింది. బాంబు పేలుళ్లతో పరిసర ప్రాంతాల ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఈ బాంబు పేలుళ్ల ప్రభావం పడింది.

2008 జులై 11వ తేదీ ముంబై నగరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్లతో 209 మందికి పైగా అమాయకులు బలి అయ్యారు. ఈ బాంబు పేలుళ్లతో హడలిపోతున్న ముంబై నగరంలో కేవలం మూడు సంవత్సరాల రెండు రోజుల వ్యవదిలో అదే జులై నెలలో మరోసారి వరుస బాంబు పేలుళ్లు జరిగాయి.

1993, 2008, 2011 సంవత్సరాల్లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. చిన్న టపాకాయ పేలిన శభ్దం వచ్చిన ముంబై నగర వాసులు హడలిపోతున్నారు. 2011 జులై 13వ తేదీ ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో కర్ణాటకలోని బత్కల్ కు చెందిన ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ నాయకుడు యాసిన్ బత్కల్, అతని సోదరుడు రియాజ్ బత్కల్ మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
The 2011 Mumbai bombings were a series of three coordinated bomb explosions at different locations in Mumbai, on 13 July 2011 between 18:54 and 19:06 IST. The blasts occurred at the Opera House, at Zaveri Bazaar and at Dadar West localities, leaving 26 killed and 130 injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X