వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంకేష్ హత్య కేసు: కీలకంగా మారిన ఆ తుపాకీ కోసం రూ. 2కోట్ల ఖర్చు! 2రాష్ట్రాల వేట

|
Google Oneindia TeluguNews

దేశీయంగా తయారు చేయడిన 7.65ఎంఎం తుపాకి ముంబై సమీపంలోని వసాయి క్రీక్‌లో వరదలో పడిపోయింది. ఆ తుపాకీని వెతికేందుకు సుమారు రూ. 2.2కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో కర్ణాటక, మహారాష్ట్ర 30:70 నిష్పత్తిలో ఖర్చుపెట్టుకోనున్నాయి. ఈ తుపాకీ దొరికితే కేసు పురోగతికి ఉపయోపడుతుంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే 18 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు.

తుపాకీని వెలికితీసేందుకు పోలీసు బలగాలు ఇప్పటికే పలు బృందాలను ఏర్పాటు చేశాయి. తుపాకీ విసిరివేయబడిన ప్రాంతంలో గాలింపు చేపడుతున్నారు. వసాయి క్రీక్ బ్రిడ్జి సమీపంలోనే ఆ తుపాకీ పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. లేదంటే వరదలు వస్తే కొంత దూరం కొట్టుకుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

2017, Gun Thrown in Vasai Creek. 2019, Flood Havoc: As Govt Puts in Crores in Gauri Lankesh Case, Cops Embark on Mission Impossible

మహారాష్ట్రలో జరిగిన నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సర్ హత్య కేసుల్లోనూ, కర్ణాటకలో జరిగిన గౌరీ లంకేష్, ఎంఎం కుల్‌బర్గీ హత్య కేసుల్లోనూ ఈ తుపాకీ కీలక ఆధారంగా మారింది. గౌరీ లంకేష్ పై కాల్పుల జరిపిన బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. అదే తుపాకీ నుంచి బుల్లెట్లు వచ్చాయని నిర్ధారించారు.

సెప్టెంబర్ 5, 2017లో గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. అంతకుముందు ఆగస్టు 2015లో ప్రొఫెసర్ కుల్‌బర్గీ హత్యకు గురయ్యారు. 2015లో వామపక్షవాది గోవింద్ పన్సర్ హత్యకు గురికాగా, 2013లో రేషనలిస్ట్ నరేంద్ర దభోల్కర్ చంపబడ్డారు. ఈ నాలుగు హత్యలకు ఆ తుపాకీతో సంబంధం ఉందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఈ కేసులో నిందితుడైన శరద్ కళస్కర్ చెప్పిన ప్రకారం దర్యాప్తులో ఈ తుపాకీ కీలకమని భావిస్తున్నారు.

వామపక్ష భావజాలం గల ఈ నలుగురు కూడా ఒకే రకంగా హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చి దుండగులే వీరిని కాల్చి చంపారు. ఈ నాలుగు హత్యలు కూడా సనాతన సంస్థకు చెందిన వ్యక్తులు చంపారనే ఆరోపణలున్నాయి. ఈ నాలుగు కేసుల్లోని నిందితులు కూడా ఒకరికొకరు తెలిసి ఉండటం గమనార్హం. లంకేష్ హత్య కేసులో 9వ నిందితుడిగా ఉన్న గణేష్ మస్కిన్.. కుల్ బర్గీని కూడా తుపాకీతో చంపినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

మరో నిందితుడు ప్రవీణ్ ఛతుర్ అలియాస్ మసాలావాలా బైక్ నడిపాడు. పద్మావతి సినిమా ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్‌పై బాంబు దాడి చేసిన కేసులో కూడా ఇతడు నిందితుడిగా ఉన్నారు. లంకేష్ కేసులో ఛార్జీ షీటు ఫైల్ చేసిన పోలీసులు.. కుల్‌బర్గీ కేసులో త్వరలో ఛార్జీ షీటు ఫైల్ చేయనున్నారు. అయితే, హత్యలకు ఉపయోగించిన ఆ తుపాకీ దొరికితే ఈ కేసుల్లో ఎంతో పురోగతి సాధించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు.

English summary
Nearly two years after the murder of prominent journalist-activist Gauri Lankesh, an SIT probing the case will embark on a crucial mission to find the murder weapon – the only missing link in the investigation so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X