2018లో టాప్ 10 చెత్త పాస్వర్డ్లు ఇవే
ముంబై: చాలామంది నిత్యం తమ పాస్వర్డ్లు మారుస్తుంటారు. కొంతమంది సులభమైన పాస్వర్డ్లు పెట్టుకుంటారు. 2018లో అత్యంత చెత్త పాస్‌వర్డ్‌గా '123456' నిలిచింది. ఓ సంస్థ ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
మొత్తం 100 చెత్త పాస్‌వర్డ్‌లను వెల్లడించింది. చెత్త పాస్‌వర్డ్‌లలో మొదటి స్థానంలో 123456 నలవగా, password రెండో స్థానంలో నిలిచింది. 123456789, 12345678, 123, డొనాల్డ్, ప్రిన్సెస్, సన్‌షైన్, ఐ లవ్యూ వంటి పాస్వర్డ్లు కూడా ఉన్నాయి. టాప్ 25లో డొనాల్డ్, ప్రిన్సెస్, సన్‌షైన్ ఉన్నాయి.

మొదటి పదిలా.. 123456, password, 123456789, 12345678, 12345, 111111, 1234567, sunshine, qwerty, iloveyou ఉన్నాయి. వినియోగదారుల ఆన్లైన్ యాక్టివిటి చాలా రహస్యంగా ఉండాలి. ఇలాంటి చెత్త పాస్ వర్డ్ల కారణంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!