2019 రౌండప్.. హిస్టరీలోనే తొలిసారి ... సామాన్యులను ఏడిపించిన ఉల్లి
2019లో దేశంలో అనేక కీలక సంఘటనలు జరిగాయి. ఇక అన్నింటిలో దేశ వ్యాప్తంగాఅటు పార్లమెంట్ ను, ఇటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలను కుదిపేసిన అంశం ఉల్లి ధరల పెంపు. సామన్యుల నాది విరిచేలా హిస్టరీలో గతంలో లేని విధంగా పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పించాయి. పాలకులకు సైతం దిక్కు తోచని స్థితి కల్పించాయి.
కన్నీరు తెప్పిచ్చిన ఉల్లి ధరలు: ఇప్పుడు పెరిగిన పాల ధరల కూడా

ఆర్ధిక మందగమనం ఎఫెక్ట్ ... పెరిగిన ఉల్లి ధరలు
ప్రపంచం ఆర్ధికంగా మందగమనంలో పయనిస్తుండటంతో దేశంలో కూడా ఆర్ధిక మందగమన ప్రభావం దారుణంగా పడింది. ఫలితంగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. సామన్యులు కొనుగోలు చెయ్యలేని స్థితికి ఉల్లి ధరలు చేరుకున్నాయి. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ముఖ్యంగా ఉల్లిని అధికంగా పండించే రాష్ట్రాల్లో పంట నష్టపోయింది . సెప్టెంబర్ వరకు కొత్త పంట చేతికి రాకపోవటంతో ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రూ. 50 నుండి రూ. 200 వరకు ఉల్లి ధర చేరుకుంది అంటే పరిస్థితి మరో వేనిజులాలా మారిందని చెప్పొచ్చు .

ఉల్లి ధరాఘాతాన్ని నేటికీ తట్టుకోలేకపోతున్న సామాన్యులు
ధరలను అదుపు చేయడానికి కేంద్రం ప్రయత్నం చేసింది. కానీ నేటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. అటు పార్లమెంట్ లో ఉల్లి ధరలపై జరిగిన చర్చలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉల్లి ధరల నియంత్రణ గురించి మాట్లాడుతూ తాను ఉల్లి ఎక్కువగా వాడను అంటూ వ్యాఖ్యలు చెయ్యటం మిగతా ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీపై అందించే ఉల్లి కోసం ప్రజలు రైతు బజార్ల ముందు నానా అవస్థలు పడ్డారు . సామాన్యులు నేటికీ ఉల్లి ధరాఘాతాన్ని తట్టుకోలేకపోతున్నారు..

ఉల్లి దొంగతనాలతో దేశంలో పరేషాన్
2019 లో అత్యధిక మంది చేత కన్నీళ్లు పెట్టించిన ఉల్లి కోసం విచిత్రంగా దొంగతనాలు కూడా జరిగాయి. దేశంలో ఉల్లిపాయల దొంగలు పెరిగిపోయారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఉల్లిపాయలు దొంగతనాల ఘటనలు పలు వెలుగుచూస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా ఓ దుకాణం లో దొంగతనం జరిగింది. ఇక ఏకంగా ఉల్లి పాయల ట్రక్ మాయం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పలు రాష్ట్రాల్లో ఉల్లి చోరులు .. 2019 లో ఏడిపించిన ఉల్లి
ఇక ఓ షాపులో నగదును వదిలేసి ఉల్లి పాయలు దొంగతనం చేసి సంచలనం సృష్టించగా ఓ రైతు పొలంలో నిల్వ చేసినుల్లిపాయలను దొంగలు దొంగలించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తాజాగా తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ అనే రైతుకు సంబంధించిన ఉల్లి పంట దొంగతనం జరిగింది. ఇలా వరుస ఉల్లి దొంగతనాలు ఉల్లి సమస్య తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికీ పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుల నడ్డి విరుస్తుండగా 2019 సంవత్సరంలో ఉల్లి తెప్పించిన కన్నీరు సామ్న్యులకు ఇప్పటికీ ఆగటం లేదు . మరి రానున్న కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందో చూడాలి మరి.