వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 మరో తమాషా.! ఈ ఏడాది మోస్ట్ నెగెటీవ్ వర్డ్ ఈస్ పాజిటీవ్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కొత్త సంవత్సరంతో పాటు నూతన దశాబ్దానికి కేరింతలతో స్వాగతం పలికిన యావత్ ప్రపంచ మానవాళిని 2020 సంవత్సరం తీవ్ర అసంత్రుప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది. 2020 నుండి 2030 వరకు అంటే పది సంవత్సారాల్లో లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో రంగంలోకి దిగిన యువత ఆశలను 2020సంవత్సరం కరోనా రూపంలో అడియాసలు చేసినట్టైంది. అంతే కాకుండా కొన్ని పదాల అర్థాలను సమూలంగా మార్చివేయడంతోపాటు, ఆ పదం వింటేనే గుండెల్లో దడ పుట్టేలా చేసింది 2020. ఎంతో సానుకూల దృక్పదానికి ప్రతీకగా వాడే ఆ పదం ఎందుకు మానవాళిని అంతగా భయబ్రాంతులకు గురి చేసిందో తెలుసుకుందాం.

పాజిటీవ్ అనగానే గజగజ వణికిపోతున్న జనం.. నెగెటీవ్ పదానికి జై కొడుతున్న జనాలు..

పాజిటీవ్ అనగానే గజగజ వణికిపోతున్న జనం.. నెగెటీవ్ పదానికి జై కొడుతున్న జనాలు..

ప్రపంచంలో భాషలు ఆవిర్బవించిన నాటి నుండి కొన్ని పదాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కొన్ని పదాలు మారుతున్న కాలంలో పరిస్థితులకనుగుణంగా వాటి ప్రాముఖ్యతను కోల్పాయాయని చెప్పొచ్చు. అలాంటి సంఘటనే 2020లో చొటుచేసుకుంది. ఈ ఏడాదిలో పాజిటీవ్ అనే పదం నెగటీవ్ కోణంలో చాలా ప్రాచూర్యం పొందినట్టు నిర్థారణ అవుతోంది. సాదారణంగా పాజిటీవ్ అనే పదాన్ని సానుకూల దృక్పదం నేపథ్యంలో సంభోదించడం సర్వసాధారణం. అన్ని అంశాల్లో పాజిటీవ్ ధోరణిలో ఉండాలి అంటే సానుకూలంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు ఉంటాయనే అర్థం వచ్చేలా ప్రాచూర్యం జరుగుతుంది. కాని తెలుగులో ఈ సానుకూల దృక్పదం అనే పదానికి ఇంగ్లీష్ లో పాజిటీవ్ అనే పదానికి ప్రస్తుతం పెద్ద చిక్కులొచ్చిపడినట్టు తెలుస్తోంది.

పరిస్థితులను సమూలంగా మార్చేసిని కరోనా.. నెగెటీవ్ ఫలితాన్ని కోరుకుంటున్న ప్రజానికం..

పరిస్థితులను సమూలంగా మార్చేసిని కరోనా.. నెగెటీవ్ ఫలితాన్ని కోరుకుంటున్న ప్రజానికం..

ఇదిలా ఉండగా అనుకూల పరిస్దితులు, ప్రతికూల పరిస్ధితులు అనే పదాలకు పాజిటీవ్ మరియు నెగటీవ్ అనే పదాలకు అవినాభావ సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాని ఎక్కడైన, ఏ పరిక్షల్లో నైనా, ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ ఇంటర్య్వూలో ఫలితాలు పాజిటీవ్ గా రావాలని, చాలా వరకు ఆశిస్తుంటారు. అంతే కాకుండా నూతన గృహం కొనుగోలు చేసినా, కొత్త కారు గాని, బైక్ గాని కొనుగోలు చేసినప్పుడు అంతా శుభం జరగాలని కోరుకోవడంతో పాటు అంతా పాజిటీవ్ గా జరిగిపోవాలని పెద్దలు ఆశీర్వదిస్తుండటం సర్వ సాధారణంగా జరిగిపోతుంటుంది. మరి ఇప్పుడు అదే పాజిటీవ్ అనే పదం పట్ల జనం ఎంత ఖంగారుపడిపోతున్నారో అర్థం అవుతుంది కదా.

శుభం జరగాలంటే పాజిటీవ్ గా ఉండాలంటారు.. కాని పాజిటీవ్ అంటేనే భయం వ్యక్తం చేస్తున్న ప్రపంచ జనాబా..

శుభం జరగాలంటే పాజిటీవ్ గా ఉండాలంటారు.. కాని పాజిటీవ్ అంటేనే భయం వ్యక్తం చేస్తున్న ప్రపంచ జనాబా..

కాని కరోనా వైరస్ మహమ్మారి పాజిటీవ్ అనే పదాన్ని భయంకరమైన వినకూడని పదంగా మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటీవ్ అనే పదం వినబడితేనే గడగడ వణికిపోయే పరిస్ధితులను తీసుకొచ్చింది కరోనా. పాజిటీవ్ లేదా సానుకూల దృక్పదం అనే పదానికి ఉన్న ప్రత్యేకతను, పవిత్రతను పూర్తిగా చెరిపేసింది కరోనా వైరస్ మహమ్మారి. సానుకూల ఫలితం కాకుండా ప్రతికూల ఫలితం వచ్చిందంటే పెద్ద ఎత్తున స్వాగతించే పరిణామాలను ప్రపంచంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చింది కరోనా వైరస్.

Recommended Video

Coronavirus Survive For 28 Days On Smartphones, Currency ఈ వస్తువులపై 28 రోజుల పాటు జీవించే కరోనా!!
పాజిటీవ్ పదం అంటే ఇప్పుడు రోత.. నెగటీవ్ అనే పదాన్ని ఇష్టపడుతున్న ప్రపంచ దేశాలు..

పాజిటీవ్ పదం అంటే ఇప్పుడు రోత.. నెగటీవ్ అనే పదాన్ని ఇష్టపడుతున్న ప్రపంచ దేశాలు..

పాజిటీవ్ పదాన్ని చీదరించుకుని, నెగటీవ్ పదాన్ని ఇష్టపడే బృహత్కర మార్పును ప్రపంచ దేశాలకు చాలా తక్కువ సమయంలో ఎంతో సునాయసంగా పరిచయం చేసింది కరోనా. ప్రపంచ వ్యాప్తంగా తమ తమ బంధువులకు పాజిటీవ్ అనే పదంతో సంబంధాలు ఏర్పడ్డాయని తెలిసిన మరుక్షణం, నెగెటీవ్ ఎప్పుడు వస్తుంది అని భయం భయంగా ప్రశ్నించే పరిస్థితులను కరోనా మోసుకొచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎంతో విలువైన మరెన్నో సానుకూల అర్ధాలు ఇమిడి ఉన్న అనుకూల దృక్పదం అనే పదం లేదా పాజిటీవ్ అనే పదానికి ప్రజలు భయకంపితులవుతున్నట్టు తెలుస్తోంది. సో 2020 సంవత్సరంలో మోస్ట్ నెగటీవ్ వర్డ్ ఈస్ పాజిటీవ్ అనే చర్చ జోరుగా జరుగుతున్నట్టు నిర్ధారణ అవుతోంది.

English summary
The word positive is becoming more and more popular in the negative sense in 2020. So in the year 2020, it is being confirmed that the discussion of the most negative word is positive is going on loudly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X