వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 బిగ్గెస్ట్ డిజాస్టర్ కరోనా .. కేరళలో మొదలై తబ్లీగీ జమాత్ తో దేశమంతా వ్యాప్తి

|
Google Oneindia TeluguNews

2020లో భారతదేశంలో అతి పెద్ద డిజాస్టర్ గా కరోనా వైరస్ భారతదేశాన్ని వణికించింది. 2020 జనవరి 30వ తేదీన కేరళ రాష్ట్రంలో తొలి కేసు నమోదుతో ప్రారంభమైన కరోనా వ్యాప్తి ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ జమాత్ సభతో దేశవ్యాప్తంగా విస్తరించింది. అప్పుడు ప్రారంభమైన కరోనా కేసులు నమోదు నేటికీ కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో 2020 సంవత్సరం కరోనా కారణంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగానే కాకుండా అన్ని రంగాలలోనూ వెనుకబడింది. నేటికీ కరోనా విలయ తాండవం చేస్తూనే ఉంది.

ఓటర్లు రాక పోలింగ్ కేంద్రాలు ఖాళీ .. గ్రేటర్ పోలింగ్ తగ్గటానికి చలి , కరోనా కారణాలన్న ఎస్ఈసి ఓటర్లు రాక పోలింగ్ కేంద్రాలు ఖాళీ .. గ్రేటర్ పోలింగ్ తగ్గటానికి చలి , కరోనా కారణాలన్న ఎస్ఈసి

జనవరి 30వ తేదీన కేరళలో తొలి కేసు

జనవరి 30వ తేదీన కేరళలో తొలి కేసు

భారతదేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదయింది. కేరళ రాష్ట్రానికి చెందిన వూహాన్ లో చదువుతూ ఇండియాకు వచ్చిన విద్యార్థికి, అక్కడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న క్రమంలోనే కరోనా సోకినట్లుగా అధికారులు గుర్తించారు.
ఇది దేశంలోనే నమోదైన తొలి కేసు కాగా మొదటి కరోనా కేసు జనవరి 30వ తేదీన నమోదయింది. ఆ తర్వాత విదేశాల నుండి ఇండియాకి వచ్చిన వారి ద్వారా అక్కడక్కడా కరోనా కేసులు నమోదు అవుతున్న క్రమంలో తబ్లీఘీ జమాత్ సభ భారత దేశంలో కరోనా వ్యాప్తికి సూపర్ స్ప్రెడర్ అయింది .

 మార్చిలో ఢిల్లీలో తబ్లీఘీ జమాత్ సభ .. కరోనా సూపర్ స్ప్రెడర్ గా సభ

మార్చిలో ఢిల్లీలో తబ్లీఘీ జమాత్ సభ .. కరోనా సూపర్ స్ప్రెడర్ గా సభ

2020 లో కరోనా మహమ్మారి ఇండియాలో మరణమృదంగం మోగించింది.

2020 మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కాజ్ మసీదులో జరిగిన ఒక మతపరమైన తబ్లిఘి జమాత్ సభ కరోనావైరస్ సూపర్-స్ప్రెడర్ గా ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోయింది. అప్పటివరకూ పదుల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు కాస్త, ఒక్కసారిగా వేలల్లో కి మారిపోయాయి . తబ్లీఘీ జమాత్ సభకు దేశవ్యాప్తంగా ముస్లిం హాజరు కావడంతో, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి ఈ సభ కారణమైంది. ఇక ఈ సభకు వచ్చిన విదేశీయుల ద్వారా కరోనా శరవేగంగా భారత్ లో వ్యాపించింది.

దేశ వ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కాజ్ సభతో కరోనా ప్రకంపనలు .. వేలసంఖ్యలో పెరిగిన కేసులు

దేశ వ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కాజ్ సభతో కరోనా ప్రకంపనలు .. వేలసంఖ్యలో పెరిగిన కేసులు

ఒక్క తబ్లీఘీ జమాత్ సభకు హాజరైన వారిలోనే 4,000 కన్నా ఎక్కువ కేసులు ధృవీకరించడ్డాయి అంటే ఎంతగా ఈ సభ కరోనాను వ్యాప్తి చేసిందో అర్ధం చేసుకోవచ్చు .కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా తబ్లీఘీ జమాత్ సభ ప్రకంపనలు సృష్టించింది .విదేశాల నుండి మిషనరీలు ఈ సభకు హాజరయ్యారు. 40 దేశాల నుండి 960 మంది విదేశీ ప్రముఖులు హాజరయ్యారు.

ఏప్రిల్ 18 న, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సంఘటనతో 4,291 కరోనా కేసులు భారతదేశంలో ధృవీకరించబడిన అన్ని కేసులలో మూడవ వంతు ప్రాతినిధ్యం వహించాయి.

దేశవ్యాప్తంగా తబ్లీఘీ జమాత్ సభపై నిరసన .. కరోనా హాట్ స్పాట్ గా సభ .. ఫైర్

దేశవ్యాప్తంగా తబ్లీఘీ జమాత్ సభపై నిరసన .. కరోనా హాట్ స్పాట్ గా సభ .. ఫైర్

దేశవ్యాప్తంగా తబ్లిఘీ జమాత్ కు హాజరైనవారు మరియు వారి పరిచయాలతో సహా సుమారు 40,000 మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు

. మార్చి 13 న ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించడాన్ని నిషేధించినప్పటికీ, తబ్లిఘి జమాత్ సభ నిర్వహించడంపై , కరోనా ని వ్యాప్తి చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. భారతదేశం అంతటా కోర్టులలో ఈ సభకు హాజరైన వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

 అప్పటి నుండి కరోనాతో భారత్ యుద్ధం కొనసాగుతూనే ఉంది

అప్పటి నుండి కరోనాతో భారత్ యుద్ధం కొనసాగుతూనే ఉంది

ఢిల్లీలోని నిజాముద్దీన్లో తబ్లిఘి జమాత్ సభకు హాజరైన విదేశీ ప్రముఖుల ద్వారా, వివిధ రాష్ట్రాల ప్రజల ద్వారా భారతదేశం అంతటా కరోనా వైరస్ విస్తరించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అప్పటినుండి ఇప్పటివరకు భారతదేశం యుద్ధమే చేస్తున్న మహమ్మారి మాత్రం విజృంభిస్తూనే ఉంది. 2020 దేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచ చరిత్రలోనూ కరోనా సృష్టించిన విలయం, కరోనా మిగిల్చిన విషాదం, కరోనా కారణంగా దెబ్బతిన్న పరిస్థితులు ఎవరూ మర్చిపోలేరు . కరోనా మహమ్మారి పంజా విసరడంతో 2020 భారతదేశానికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.

English summary
The corona virus outbreak is the biggest disaster in India in 2020. The corona outbreak, which started with the registration of the first case in the state of Kerala on January 30, 2020, has spread across the country with the Tablighi Jamat meeting in Delhi. The registration of corona cases that began then continues to this day. The year 2020 in India is lagging behind in all sectors not only financially and healthily due to corona. To this day, the corona continues to thrive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X