వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండమాన్‌లో పడవ మునగి 21 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నడిసమద్రంలో ఆదివారం పడవ బోల్తా పడి 21 మంది మృ త్యువాతపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మృతులంతా కాంచీపురంవాసులని నికోబార్ డిప్యూటీ కమిషనర్ పి.జవహర్ తెలిపారు. వీరు ముంబైకి చెందిన ఏడుగురు అండమాన్ నుంచీ 'అక్వా మెరైన్' అనే పర్యాటక పడవలో పర్యటనకు వెళ్లారు.

సిబ్బంది సహా పడవలో మొత్తం 46 మంది ఉన్నారు. 36 మందిని మాత్రమే భరించగలిగిన ఆ పడవ అధిక బరువు కారణంగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 21 మంది నీట మునిగి మరణించారు.
ప్రాణాలతో వున్న వారు తీరానికి చేరుకుని అందించిన సమాచారం మేరకు స్థానిక అగ్నిమాపకదళం, కోస్ట్‌గార్డ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి 32 భౌతికకాయాలను తీరానికి చేర్చే పనులు నిర్వహిస్తున్నారు.

Andaman

ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం లక్ష పరిహారంగా ప్రకటించింది. యాత్రికులు ప్యాకేజీ టూర్‌పై గురువారంనాడు పొర్ట్ బ్లెయిర్‌కు వచ్చారు.

లోకల్ టోల్ ఫ్రీ నెంబర్ 1070
ఇతర హెల్ప్‌లైన్ నెంబర్లు 03192 - 240127, 230178, 23881

English summary
At least 21 people have been reportedly died and several are missing after a tourist boat capsized near Port Blair in Andaman and Nicobar Islands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X