వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్తీ మద్యానికి 21 మంది బలి... పిట్టల్లా రాలిపోతున్న జనం... విచారణకు ఆదేశించిన సీఎం...

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించిన 21 మంది మృతి చెందారు. అమృత్‌సర్,బతాలా,తర్న్ తరన్ జిల్లాల్లో బుధవారం రాత్రి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. కల్తీ మద్యం మరణాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దీనిపై విచారణకు ఆదేశించారు. కల్తీ మద్యం సేవించి జనం పిట్టల్లా రాలుతుండటంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. కల్తీ మద్యం మూలాలను పెకిలించివేయాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

డీజీపీ ఏమన్నారు...

డీజీపీ ఏమన్నారు...

పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా మాట్లాడుతూ... కల్తీ మద్యం కారణంగా అమృత్‌సర్‌లోని ముచ్చల్,తంగ్రా గ్రామాల్లో మొదట జూలై 29న ఐదు మంది చనిపోయినట్లు తెలిపారు. అదే ముచ్చల్ గ్రామంలో గురువారం(జూలై 30) సాయంత్రం మరో ఇద్దరు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రాత్రి మరో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం బతాలా జిల్లాలోనూ కల్తీ మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

విచారణకు ఆదేశించిన సీఎం....

విచారణకు ఆదేశించిన సీఎం....

శుక్రవారం బతాలా జిల్లాలో మరో ఐదుగురు మృతి చెందడంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 7కి చేరినట్లు డీజీపీ తెలిపారు. అలాగే తర్న్ తరన్ జిల్లాలో నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. మొత్తంగా కల్తీ మద్యం సేవించి మూడు జిల్లాల్లో 21 మంది మరణించారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దీనిపై జలంధర్ డివిజనల్ కమిషనర్‌తో న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ మరణాలకు సంబంధించి డివిజనల్ కమిషనర్ నిజ నిర్దారణ చేపట్టనున్నారు. పంజాబ్ జాయింట్ ఎక్సైజ్,టాక్సేషన్ కమిషనర్,ఎస్పీ కూడా డివిజనల్ కమిషనర్‌తో పాటు నిజ నిర్దారణ బృందంలో సభ్యులుగా ఉంటారు.

ఒకరి అరెస్ట్...

ఒకరి అరెస్ట్...


విచారణ విషయంలో డివిజనల్ కమిషనర్‌కు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్చనిచ్చారు. విచారణ వేగవంతంగా పూర్తి చేయడానికి ఏ పోలీస్ అధికారి లేదా నిపుణుల సహకారం తీసుకునేందుకు అనుమతినిచ్చారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనకు సంబంధించి ముచ్చల్ గ్రామానికి చెందిన బల్వీందర్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 304,ఎక్సైజ్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం మృతులు జస్వీందర్ సింగ్,కశ్మీర్ సింగ్,కృపాల్ సింగ్,జశ్వంత్ సింగ్‌ల మృతదేహాలకు శుక్రవారం(జూలై 30) పోస్టుమార్టమ్ నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు.

Recommended Video

Privatisation of Banks : Modi Govt Plans To Reduce Number Of Public Sector Banks In India
మృతులు వీరే...

మృతులు వీరే...

కల్తీ మద్యం సేవించి మృతి చెందినవారి వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో ముచ్చల్ గ్రామానికి చెందిన మంగల్ సింగ్,దల్బీర్ సింగ్,గుర్‌ప్రీత్ సింగ్,కశ్మీర్ సింగ్,కాకా సింగ్,కృపాల్ సింగ్,జోగా సింగ్ ఉన్నారు. అలాగే బతాలాకు చెందిన బుటా రామ్,భిండా,రికూ సింగ్,కలా కలు,బిల్లా,జతీందర్ ఉన్నారు. తంగ్రాకు చెందిన బల్‌దేవ్ సింగ్,తర్న్ తరన్‌కి చెందిన సాహిబ్ సింగ్,హర్బన్ సింగ్,సుఖ్‌దేవ్ సింగ్,ధరమ్ సింగ్ ఉన్నారు.

English summary
Twenty-one people have died in Punjab's three districts allegedly after drinking spurious liquor, prompting Chief Minister Amarinder Singh to order a magisterial probe, officials said on Friday. The deaths took place in Punjab's Amritsar, Batala and Tarn Taran districts since Wednesday night, an official statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X