వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21 మంది మున్సిపాల్ అధికారుల సస్పెండ్ .. ఎందుకో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

భోపాల్ : ఇండోర్ మున్సిపల్ కార్యాలయ అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ బ్యాటుతో దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇండోర్ మున్సిపల్ కార్యాలయం 21 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. బుధవారం అధికారిపై ఎమ్మెల్యే దాడి చేస్తుండగా మద్దతు తెలిపారని తెలిపింది. ఓ అధికారికి కొట్టకుండా నిలువరించాల్సింది పోయి .. ఎమ్మెల్యేకు మద్దతు తెలుపడం ఏంటని ప్రశ్నించింది.

రెండువర్గాలుగా చీలి ..

రెండువర్గాలుగా చీలి ..

ఇండోర్ దాడికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ ఫుటేజీలో ఆకాశ్ పక్కనే అధికారులు ఉన్న విషయాన్ని గుర్తించారు. ఆధారంగా అధికారులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఆకాశ్ దాడిని నిరసిస్తూ గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మరో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారిపై దాడిని మధ్యప్రదేశ్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఆకాశ్‌పై కేసు నమోదు చేసి .. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆకాశ్ సహా మరో పది మందిపై కేసు నమోదు చేశారు. తమకు బెయిల్ ఇవ్వాలని కోరిన స్థానిక కోర్టు తిరస్కరించింది.

ఎందుకు కొట్టానంటే ..

ఎందుకు కొట్టానంటే ..

అవినీతిని నిర్మూలించేందుకు నడుం బిగించామని సహకరించాలని కోరామని .. విజ్ఞప్తి చేశామని అయినా వినకపోతే దాడి చేశామని ఎమ్మెల్యే ఆకాశ్ పేర్కొన్నారు. భవనం నిర్మాణం కూల్చివేత ఆపకుంటే చర్యలు తప్పవని అధికారులను బెదిరించారు. తర్వాత క్రికెట్ బ్యాటు తీసుకొని .. స్థానికులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే దాడి చేశాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డవడంత వెంటనే .. ప్రపంచానికి తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి .. ఎమ్మెల్యే, అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ విషయం ...

మధ్యప్రదేశ్‌లోగల ఇండోర్‌లో భవనాన్ని కూల్చివేయాలని యాజమాని కార్పొరేషన్ కోరారు. అయితే అందులో కొందరు నివసిస్తున్నారని ఎమ్మెల్యే ఆకాశ్ వాదిస్తున్నారు. ఇదే విషయం అడిగేందుకు ఫోన్ చేస్తే తన కాల్ లిప్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటువేసిన ప్రజలకు ప్రతినిధినని .. వారికి సంబంధించి బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. అయితే తనను మళ్లీ సంప్రదించకుండా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపగించుకున్న ఆకాశ్ .. మున్సిపల్ అధికారిపై బ్యాటు ఝులిపించాడు. బ్యాటుతో కొడుతుండగా అక్కడున్న మీడియా ప్రతినిధులు ఘటనను కెమెరాలో రికార్డ్ చేశారు. దీంతో దాడికి సంబంధించిన విషయం వెంటనే సమాజానికి తెలిసిపోయింది.

English summary
After the dispute between Indore BJP MLA Akash Vijayvargiya and municipal officers on Wednesday, the municipal commission on Thursday suspended 21 employees, who were rallying in support of the BJP leader instead of their colleagues during the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X