ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య, మూడు రోజుల్లో పరీక్షలు, ఇంతలో ఇలా !
జీవితంపై విరక్తి పెంచుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది.
మైసూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది. మైసూరులోని శ్రీరాంపుర సమీపంలోని బెమల్ లేఔట్ లో నివాసం ఉంటున్న సంయమి గౌడ (21) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
మైసూరు నగరంలో ప్రసిద్ది చెందిన జీఎస్ఎస్ఎస్ కాలేజ్ లో సంయమి గౌడ ఇంజనీరింగ్ మూడో సెమిస్టర్ చదువుతోంది. సంయమి గౌడ రెండు మూడు రోజుల్లో మూడవ సెమిస్టర్ పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యింది.

అయితే సోమవారం ఉదయం ఇంటిలో సంయమిగౌడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న కువెంపునగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సంయమి గౌడ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని కేసు విచారణలో ఉందని కువెంపునగర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications