వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహజీవనం: 30ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు

|
Google Oneindia TeluguNews

రాంచీ: పేదరికం వారికి పెళ్లికి అడ్డొచ్చింది. దీంతో మూడు ముళ్లు.. ఏడు అడుగుడులు వేయలేయకుండానే వారు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఇలా 21 జంటలు.. 30ఏళ్లపాటు కాపురం చేశాయి. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఇప్పుడు వారంతా ఒక్కటయ్యారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ఖుంతీ జిల్లాలోని ముండా తెగ కడు పేదరికంలో ఉంది. వివాహం చేసుకునే ఆర్థిక స్తోమత కూడా వారికి లేదు. దీంతో పెళ్లి తంతు లేకుండానే 30 ఏళ్లు తమ సంసార ప్రయాణాన్ని సాగించాయి. నిమిట్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ 21 జంటలకు ఆదివారం ఘనంగా వివాహం జరిపించింది.

21 tribal couples living together for over 30 yrs to tie knot with NGO help

ఈ సందర్భంగా నిమిట్ డైరెక్టర్ నిఖితా సిన్హా మాట్లాడుతూ.. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో(పారిశుద్ధ్యంపై) భాగంగా ముండా తెగ నివసిస్తున్న గ్రామానికి వెళ్లినప్పుడు 21జంటలు పెళ్లిళ్లు లేకుండానే సంసార జీవితాన్ని గడుపుతున్నాయని తెలిసిందని చెప్పారు.

ఆ జంటలకు ఘనంగా పెళ్లి చేయాలని అనాడే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే 21 జంటలకు వివాహం జరిపించామని నిఖితా సిన్హా పేర్కొన్నారు. అంతేగాక, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇక్కడి గ్రామాల్లో పరిశుభ్రతకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

English summary
Ropni Devi and her daughter Priyanka Pahan are all set to get married to their respective partnerson Sunday at town hall in Khunti. They are among 21 couples entering into a wedlock on the initiative of Khunti district administration and an NGO named Nimitt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X