వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: ఐసీయూ వార్డులో పైశాచికం, రోగిపై లైంగికదాడి..పేపర్ మీద రాసి మరీ..

|
Google Oneindia TeluguNews

రోజు రోజుకు దారుణమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. రోగంతో ఆస్పత్రికి వచ్చిన మహిళలను కూడా వదలడం లేదు. గురుగ్రామ్‌లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ రోగిపై సిబ్బంది ఒకరు లైంగికదాడి చేశారు. ఆ యువతి పేరంట్స్‌కు చెప్పడంతో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆస్పత్రిలో చేరితే

ఆస్పత్రిలో చేరితే

ఓ యువతి టీబీ, శ్వాస కోస ఇబ్బందులతో ఈ నెల 21వ తేదీన గురుగ్రామ్ సెక్టార్ 44 వద్ద గల పోర్టిస్ దవాఖానలో చేరింది. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమెకు కొంచెం సృహ ఉండగా వార్డు సిబ్బంది ఒకరు లైంగికదాడి చేశారు. తర్వాత యువతి తన తండ్రికి మంగళవారం జరిగిన ఘటన గురించి పేపర్‌పై రాసి చూపించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

ఈ రోజుల్లో ఘటన

ఈ రోజుల్లో ఘటన

ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య ఘటన జరిగి ఉంటుందని యువతి కుటుంబసభ్యులు చెప్తున్నారు. యువతి స్వస్థలం మహేంద్రగఢ్ అని.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని ఏసీపీ ఉష తెలపారు. ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం కూడా సీరియస్‌గా తీసుకున్నది. లైంగికదాడి చేసిన వారిని గుర్తించింది. అయితే యువతి మాత్రం వికాస్ అని చెప్పిందని తండ్రి పేర్కొన్నారని ఉష వివరించారు. దీంతో అతను నాన్ మెడికల్ ఔట్ సోర్స్‌డ్ స్టాఫర్‌గా గుర్తించారు.

సీసీటీవీ ఫుటేజీ చెక్

సీసీటీవీ ఫుటేజీ చెక్

ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే యువతి కోలుకోకపోవడంతో ఆమె నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేయలేదని చెప్పారు. అయితే యువతి తండ్రి మాత్రం ఫీమేల్ వార్డులో అతనికి ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. వార్డులో తన కూతురిపై లైంగికదాడి జరిగిందని చెప్పారు. దీంతో ఆస్పత్రిలో ఏ విధంగా భద్రత ఉందో అర్థమవుతోందని తెలిపారు.

English summary
21-year-old tuberculosis patient admitted in Fortis Hospital in Gurugram’s Sector 44 was allegedly raped by a member of the staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X