వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని సభలో అపశృతి: 22మందికి గాయాలు, ‘ఆస్పత్రి బెడ్‌పైనే మోడీని ఆటోగ్రాఫ్ అడిగింది’

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆస్పత్రి బెడ్‌పైనే మోడీని ఆటోగ్రాఫ్ అడిగిన యువతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో ఏర్పాటు చేసిన కృషి వికాస్ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తుండగా ఓ టెంట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.

క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోడీ.. వారిని పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

22 injured as tent collapses during PM Modis address

బాధితులను అప్యాయంగా పలకరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. గాయపడి ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న ఓ యువతి.. ప్రధాని రాగానే ఆయన ఆటోగ్రాఫ్ అడగటం గమనార్హం. ఆమె కోరిన వెంటనే ప్రధాని అక్కడే ఆమెకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

కాగా, టెంట్ కుప్పకూలిన ఘటనలో 20 మంది గాయపడటంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. గాయపడ్డ వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మమతా బెనర్జీ చెప్పారు.

English summary
At least 22 people have been injured after a portion of the tent collapsed during PM Narendra Modi's rally in Midnapore on Monday. PM instructed the SPG personnel to look after the people and attend to the injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X