వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానాశ్రయ మరుగుదొడ్డిలో 22 6ఎస్ ఐఫోన్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్‌లో అధికారులు 22 6ఎస్ ఐ ఫోన్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు బుధవారం తెలిపారు.

ఐఫోన్లను దుబాయ్‌ నుంచి పంజాబ్‌ ప్రయాణికుడు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఫోన్లను మరుగుదొడ్డిలో గతరాత్రి గుర్తించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏడుగురు యువకులను అరెస్టు చేశారు.

 22 iPhone 6S Seized From Indira Gandhi International Airport's Toilet

అంగం నరికేశాడు

పక్కింటి వ్యక్తితో తన భార్యను అభ్యంతకరమైన పరిస్థితులో కలిసి ఉండటం చూసిన ఓ వ్యక్తి.. ఆగ్రహంతో ఆ వ్యక్తి అంగాన్ని కోసేశాడు. ఈ సంఘటనతో ఆ పక్కింటి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని హర్దా సమీపంలోని బస్పని గ్రామంలో జరిగింది.

పతిరామ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉండటాన్ని చూసిన... భర్త మంగళ్ అనే వ్యక్తికి పట్టరాని కోపం వచ్చింది. దాంతో వెంటనే గొడ్డలి తీసుకొని అతని పైన దాడి చేశాడు. ఒక్క గొడ్డలి వేటుతో అంగాన్ని కోశాడు. దీంతో అతను అక్కడికి అక్కడే మరణించాడు.

అనంతరం తాను పోలీసులకు లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్ వెళ్తున్నట్లు భార్యకు చెప్పాడు. అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి మంగళ్ కోసం గాలిస్తున్నారు.

మహిళ ముక్కు కోసి పరారైన గుర్తుతెలియని వ్యక్తి

ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న మహిళపై దాడి చేసి కిరాతకంగా ముక్కు కోసి పారిపోయాడు. ఆ సమయంలో మహిళ పక్కన మూడేళ్ల ఆమె కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె అరవడంతో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి ఆస్పత్రికి తరలించారు.

మొదట సంజయ్ గాంధీ మెమోరియల్‌ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తర్వాత సఫ్దర్ గంజ్‌ ఆసుపత్రికి తరలించారు. మహిళ భర్త డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఘటన జరిగిన సమయంలో అతడు ఇంట్లో లేడు. మంగోల్‌పురి పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
22 iPhone 6S Seized From Indira Gandhi International Airport's Toilet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X