• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్ధమాన గాయని దారుణ హత్య! ఆ కేసులో.. ప్రధానసాక్షిఈమే, అందుకే లేపేశారా?

By Ramesh Babu
|
  ప్రముఖ "సింగర్" దారుణ హత్య! : Video | Oneindia Telugu

  చండీఘడ్‌: హర్యానాలో వర్ధమాన గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆమెపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత‍్య చేశారు.

  పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. వ‍్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

  పోలీసుల కథనం ప్రకారం... పానిపట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గాయని హర్షిత సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి కారులో ఢిల్లీకి బయలుదేరారు. ఛమ్రా గ్రామ సమీపంలోకి రాగానే మరో కారు ఈమె కారును ఓవర్ టేక్ చేసి ముందుకెళ్ల్ళి ఆగింది.

  22-Year-Old Haryana Singer Harshita Dahiya Killed Near Delhi, Shot 6 Times In Neck And Head

  అందులోంచి దిగిన ఇద్దరు యువకులు గాయని ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ను, ఆమెకు తోడుగా ఉన్న ఇద్దరు అసిస్టెంట్లను దిగమని చెప్పి బెదిరించారు. వారు భయపడి కార్లోంచి దిగగానే ఆ ఇద్దరు దుండగులు కారులో ఉన్న గాయని హర్షితపై కాల్పులు జరిపి పారిపోయారు.

  గొంతులోంచి, నుదిటిలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో గాయని హర్షిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని పానిపట్ ఎస్పీ రాహుల్ శర్మ వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు చెప్పారు.

  గాయని హర్షిత దహియా ఢిల్లీలోని నరేలాలో నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె తల్లిని అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ కేసులో హర్షిత ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈ కేసులో హర్షిత బావ ఇప్పటికే జైలులో ఉన్నాడు.

  తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని, అయినా తాను భయపడనంటూ గతంలో హర్షిత సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో ఆమె తనకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను అడిగారా? లేదా? అన్నది తెలియరాలేదు.

  ఈ కేసును నీరుగార్చడం కోసమే ప్రధాన సాక్షి అయిన హర్షితపై దుండగులు కాల్పులు జరిపి చంపేసి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ హత్య కేసులో మరింత దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A 22-year-old singer from Haryana was shot dead today while she was returning to Delhi from nearby Panipat. Harshita Dahiya was shot six times in her neck and forehead and died on the spot, police said. The singer was returning to her home in Delhi's Narela after a performance at a village in Panipat in Haryana. En route, her car was overtaken and stopped by two men in another car in Panipat around 4 pm. "When she was returning, a car overtook her vehicle near Chamrara village and forced it to stop," senior police officer Desh Raj told news agency PTI.After overtaking the car, according to the police officer, the two unidentified men asked the driver and Harshita Dahiya's two assistants to step out of the car. They then fired seven rounds at her while she was inside the car. Six of those bullets hit her in the head and neck, killing her instantly.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more