• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేప్: అందరికీ చెప్పిందని వివస్త్రగా రోడ్డుపైకి లాక్కొచ్చాడు

By Srinivas
|
22 year old married woman raped, paraded naked in public
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22 రెండేళ్ల ఓ వివాహిత పైన అత్యాచారం చేసిన వ్యక్తి... ఆమెను వివస్త్రను చేసి ప్రజల మధ్యకు తీసుకు వచ్చాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని కంచికనఖేడా గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది.

వివాహిత పైన అతను అత్యాచారం చేశాడు. దానిని ఆమె బహిర్గతం చేసింది. దీంతో రెచ్చపోయిన అతను దారుణంగా వ్యవహరించాడు. ఆగ్రహంతో ఆమెను వివస్త్రను చేసి నడిబజారులో నిలబెట్టి దారుణంగా అవమానించాడు.

బాధితురాలు ఫిర్యాదు ప్రకారం... బహిర్భూమికి వెళ్లిన ఆ యువతిపై సౌదన్ సింగ్ (40) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంగతి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే, ఆమె గ్రామస్థులతో తన గోడు వెళ్లబోసుకుంది.

దీంతో ఆగ్రహించిన సౌదన్, దౌర్జన్యంగా ఇంట్లో ప్రవేశించి, ఆమె దుస్తులు చింపేశాడు. అంతటితో వదలక జుట్టుపట్టి వీధిలోకి ఈడ్చుకొచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సౌదన్‌ను అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. గ్రామస్థులు ఆమెను రక్షించారు.

English summary
A twenty two-year-old married woman was not only raped by a muscleman, but also paraded naked in public, after she revealed the incident to villagers at Kachikanakheda village, near the historic Sanchi town in the district, the police said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X